Home » మ‌నం పిచ్చి మొక్క అనుకునే ఈ మొక్క వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..?

మ‌నం పిచ్చి మొక్క అనుకునే ఈ మొక్క వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..?

by Anji
Ad

మ‌న జీవ‌న ఈ శైలిలో మార్పులు వ‌ల్ల ఎన్నో వ్యాధులు వ‌స్తుంటాయి. మ‌నం తినే ఆహారంలో కూడా మార్పుల సంభ‌వించ‌డం వ‌ల్ల మ‌నం జీవించే విధానంలో మార్పుల వ‌ల్ల వ‌చ్చే వ్యాధుల‌కు మ‌నం ఇంగ్లీషు మందులు వాడుతున్నాం. అలా ఇంగ్లీషు మందులు వాడ‌డం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తుంటాయి. ఒక‌దానికి మందులు వేసుకుంటే మ‌రొక నాలుగు వ్యాధులు కూడా యాడ్ అవుతుంటాయి. ఎక్కువ‌గా టాబ్లెట్లు వాడ‌డం వ‌ల్ల గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం, కిడ్నీల ప‌నితీరు త‌గ్గిపోతుంటుంది. ఇక ఎక్కువ‌గా ఇంగ్లీషు మందులు వాడ‌కుండా న్యాచుర‌ల్‌గా త‌గ్గించుకోవ‌డం ఎలాగో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా మీ పొలంలో అక్క‌డ‌క్క‌డ పెరిగే వెర్రి పుచ్చ మొక్క. దీనిని పిచ్చి మొక్క అని కూడా అంటారు. దీనికి పేర్లు చాలానే ఉన్నాయి. ఈ మొక్క సంస్కృతంలో ఇంద్ర‌వారుని, హిందీలో ఇంద్రాయిన్ అంటారు. ఈ మొక్క వ‌ల్ల ఎన్నో లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది దోసకాయ మాదిరిగా ఉంటుంది వెర్రిపుచ్చ‌. ఈ మొక్క యొక్క వేర్ల నుంచి మొద‌లుపెడితే దీని ఆకులు, కాండం, కాయ‌, దీని ప్ర‌తి భాగం కూడా ప‌లు వ్యాధుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న‌కు జ‌లుబు, ద‌గ్గు వ‌ల్ల వ‌చ్చే క‌ఫాన్ని త‌గ్గిస్తుంది. పొట్ట స‌మ‌స్య‌లకు మ‌న శ‌రీరంపైన వ‌చ్చే గ‌డ్డ‌లు, చిన్న చిన్న కురుపుల‌కు దీని ఆకుల‌ను ఆముదంలో వేసి మ‌రిగించి కొంచెం గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే గ‌డ్డ‌లు, కురుపులపై పెట్ట‌డం ద్వారా అవి తొల‌గిపోతాయి.

Advertisement

ఇక పుచ్చ‌కాయ నుంచి మెత్త‌ని గుజ్జును తీసి కొంచెం సేపు కాగ‌పెట్టి దీనిని పొట్ట‌పై ఉంచ‌డం వ‌ల్ల క‌డుపులో ఉండే నులిపురుగులు చ‌నిపోయి మ‌లం ద్వారా బ‌య‌టికి వ‌స్తాయి. కొందరు మ‌హిళ‌లకు త‌ల‌లో పేను కొరుకుడు స‌మ‌స్య ఉంటుంది. ఇలాంటి స‌మ‌స్య‌కు దీని వేర్లను తీసి దానికి స‌మానంగా బెల్లం క‌లిపి మెత్త‌గా చేసుకుని దానిని త‌ల‌పై పెట్టుకుని 20 నిమిషాల త‌రువాత త‌ల క‌డిగి వేసుకుంటే ఆ స‌మ‌స్య త‌గ్గి అక్క‌డ జుట్టు వ‌స్తుంది. వెర్రి పుచ్చ‌మొక్క‌ల‌ను తిన‌డం ద్వారా తేలు కుట్టిన‌ప్పుడు వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ మొక్క‌ను పిచ్చి మొక్క పీకేయ‌కుండా వాడుకుంటే మ‌న‌కు వ‌చ్చే ఎన్నో వ్యాధుల‌కు మంచి మెడిసిన్ గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇన్ని లాభాలున్న ఈ మొక్క‌ను పెంచుకొని మ‌న‌కు వ‌చ్చే వ్యాధుల‌ను అరిక‌ట్టుకుందాం.

Also Read :

ప‌ళ్లు పుచ్చిపోవ‌డం వ‌ల్ల నొప్పిగా ఉందా..? ఇలా చేస్తే వెంట‌నే త‌గ్గుతుంద‌ట‌..!

ఫాద‌ర్స్ డే ఎందుకు జ‌రుపుకుంటారు..? ఇది ఎప్పుడు ప్రారంభ‌మైందో తెలుసా..?

Visitors Are Also Reading