Home » మహేష్ బాబు చేయాల్సిన హిట్ మూవీ తరుణ్ దగ్గరికీ ఎలా వెళ్లిందో తెలుసా ?

మహేష్ బాబు చేయాల్సిన హిట్ మూవీ తరుణ్ దగ్గరికీ ఎలా వెళ్లిందో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా దర్శక, రచయితలు కొన్ని సందర్భాల్లో హీరోని దృష్టిలో ఉంచుకొని కథలు రాస్తుంటారు. కొన్నిసార్లు స్టోరీ సిద్ధం చేసుకుని నిర్మాతలను సంప్రదించగా.. ఇది ఫలానా నటుడికి అయితే సెట్ అవుతుందని వాళ్లు సలహాలిస్తుంటారు. అలా దర్శకుడు కాశీ విశ్వనాధ్  రాసిన ప్రేమకథకు మహేశ్ బాబు  బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేశ్ దగ్గుబాటి సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో తన కథకి తగ్గ హీరోగా తరుణ్ ని ఎంపిక చేసుకున్నారు.  ఆ సినిమా మరేదో కాదండోయ్.. ‘నువ్వు లేక నేను లేను’. అప్పట్లో ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది.

Advertisement

Advertisement

‘మహేష్ బాబుతో  సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉంటారు. ఆయన డేట్స్ దొరకడం కష్టం. ఇప్పటికే నాకు లేట్ అయింది. ఈ కథకి తరుణ్ సరిగ్గా సరిపోతాడు. పైగా ‘నువ్వే కావాలి’ చిత్రంతో హిట్ అందుకున్నాడు’ అని సురేశ్ బాబుకి చెప్పినట్టు విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. 2002 జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. తరుణ్- హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జోడీ అందరినీ ఆకట్టుకుంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘నచ్చావులే’, ‘రైడ్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో తండ్రి పాత్రలు పోషించి మెప్పించిన కాశీ విశ్వనాధ్ కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ గా పని చేశారు. ‘నువ్వు లేక నేను లేను’తో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన తెరకెక్కించిన రెండో సినిమా ‘తొలి చూపులోనే’. అందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు.

Also Read : INTI NO 13 MOVIE REVIEW : ఇంటి నెం.13 రివ్యూ.. హార్రర్ మూవీ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading