వాస్తవానికి విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తిక్ గౌడ ముగ్గురి సృష్టించిందే హోంబలే ఫిల్మ్స్. వారి ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్ అని పేరు పెట్టారట. ఎలాంటి అవగాహన లేకుండా తీసిన మొదటి సినిమానే ఫ్లాప్ అయింది. పునిత్ రాజ్ కుమార్ తో నిన్నిందలే సినిమా నిర్మించింది హోంబలే ఫిల్మ్స్. సినిమాలపై కసితో ఏడాది తిరిగే లోపు మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని యశ్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోనే వారి ప్రయాణం ప్రారంభమైంది. అంతేకాదు.. హోంబలే పేరును ఈ చిత్రం అందరికీ పరిచయం చేసిందనే చెప్పాలి.
Advertisement
Advertisement
ఇక ఆ తరువాత వరుసగా రాజకుమార, యువరత్న, కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ ఛాప్టర్ 2, కాంతార వంటి సినిమాలు హిట్ లిస్ట్ లో చేరిపోయాయి. అప్పటి వరకు కేవలం కన్నడం మాత్రమే పరిచయమున్న వీరి పేర్లు కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దేశమంతా మారుమోగి పోయాయి. ఇక ‘కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా రూ. 1250 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన కాంతార ఊహించని పాపులారిటీ సంపాదించింది. రూ.16కోట్లతో సినిమా తెరకెక్కితే దాదాపు రూ.350 కోట్లు వసూలు చేయడం విశేషం.
ప్రస్తుతం హోంబలే ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా నిర్మిస్తోంది. అదేవిధంగా టైసన్, భగీర, రిచర్డ్ ఆంథోని, ధూమం వంటి చిత్రాలను నిర్మిస్తుంది. హోంబలే నిర్మిస్తున్న సలార్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read : ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు.. ఏంటంటే..!!