Home » Manasantha Nuvve Heroine: మనసంతా నువ్వే హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏమి చేస్తుందో తెలుసా ?

Manasantha Nuvve Heroine: మనసంతా నువ్వే హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏమి చేస్తుందో తెలుసా ?

by Bunty
Ad

ప్రముఖ హీరోయిన్ రీమాసేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమైన “చిత్రం” సినిమా ద్వారానే రీమాసేన్ కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుసగా సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా మారింది. తన నటన, అందంతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి రీమా “వల్లభ” సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

reemasen

reemasen

అంతేకాకుండా అదృష్టం, బంగారం,యమగోల మళ్ళీ మొదలైంది వంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో సైతం ఈ అమ్మడు నటించి వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 2012 సంవత్సరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శివకరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం వీరికి ఒక బాబు జన్మించాడు.

Advertisement

Advertisement

అప్పటినుంచి రీమాసేన్ సినిమాల్లో పెద్దగా నటించలేదు. బాబు జన్మించిన తర్వాత రీమాసేన్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి తన పూర్తి సమయాన్ని కుటుంబంతో గడుపుతోంది. ఇక రీమాసేన్ ఒకప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు కూడా అలానే తన గ్లామర్ ని మెయింటైన్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక రీమాసేన్ భర్త ప్రముఖ పారిశ్రామికవేత్త. అంతేకాకుండా ప్రముఖ రెస్టారెంట్లకు అధినేతగా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading