మెగాస్టార్ చిరంజీవి కె.బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ నిర్మించిన తెలిసిందే. ఆ సమయంలో తాను చేస్తున్న పాత్రలకు భిన్నంగా సాప్ట్ రోల్ ని చిరంజీవి ఈ చిత్రానికి పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. రుద్రవీణ ఆర్థికంగా విజయం సాధించలేదు. కానీ ఈ సినిమాకి నేషనల్ అవార్డు లభించింది. మెగాస్టార్ చిరంజీవి రుద్రవీణ చిత్రం షూటింగ్ లో ఉండగానే వెంకటేష్ హీరోగా ఇదే చిత్రం తీయడానికి ప్రయత్నం జరిగింది. ఈ విషయం చాలా తక్కువ మాత్రమే తెలుసు. ఆ సినిమా వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
యువచిత్ర అధినేత కాట్రగడ్డ మురారి బాలకృష్ణ హీరోగా సీతారామకళ్యాణ్యం నిర్మిస్తున్న తరుణంలోనే దర్శకుడు క్రాంతికుమార్ తీసిన స్వాతి చిత్రం విడుదల అయింది. ఇక ఆ సినిమా చూసిన వెంటనే మురారి క్రాంతి కుమార్ ఆఫీస్ కి వెళ్లి రూ.20వేలు చేతిలో పెట్టి నా తరువాత సినిమాకి మీరే దర్శకత్వం వహించాలని కోరారు. స్వాతి సినిమా ఆయనను అంతగా ఆకట్టుకుంది. ఆ సమయంలోనే నాదానియల్ ఆదాని రాసిన ది స్కార్లెట్ లెటర్ చూసి అలాంటి కథనే సినిమా తీద్దామనుకున్నారు. మురారి ఆ సినిమాలో ఒంటరిగా జీవితం గడుపుతున్న యువతి పాత్రను సంగీతంగా మార్చి చేద్దామనుకున్నారు. ఫిలింఛాంబర్ లో రుద్రవీణ అని పేరు కూడా రిజిస్టర్ చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే తన కుమారుడు విక్టరీ వెంకటేష్ ని పరిచయం చేస్తూ.. కళియుగపాండవులు సినిమాని నిర్మిస్తున్నారు రామానాయుడు.
Also Read : గుర్తుపట్టలేనంత గా మారిపోయిన “ఉయ్యాల జంపాల” హీరోయిన్….సినిమాలకు ఎందుకు దూరం అయ్యిందంటే…?
Advertisement
రెండో సినిమా తనకే చేయాలంటూ రూ.50వేలు అడ్వాన్స్ ఇచ్చాడు మురారి. దర్శకుడు క్రాంతికుమార్ అని చెప్పగానే రామానాయుడు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దర్శకుని విషయం తరువాత చూద్దాంలే అన్నారు మురారి. ఓ స్టూడియోలో చిరంజీవి షూటింగ్ జరుగుతుంటే రామానాయుడు అక్కడికి వెళ్లారు. మురారి తన నిర్మాతలతో మాట్లాడుతున్నారు. మురారి రుద్రవీణ అనే టైటిల్ రిజిస్టర్ చేశారనే విషయం వారికి తెలియడంతో ఈ సినిమాకి రుద్రవీణ టైటిల్ బాగుంటుందని వారు చిరంజీవితో అన్నారు. అందరిలో ఆ టైటిల్ తనకు ఇవ్వమని మురారిని అడగడానికి చిరంజీవి ఇబ్బందిపడ్డారు. మురారి స్పందించి ఆ టైటిల్ ఇస్తానని అనుకున్నారు. నేను వెంకటేష్ తో చేసే సినిమాకి ఇప్పుడే రిజిస్టర్ చేసి వస్తున్నానని చెప్పడంతో ఇక ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు. ఆ మరునాడు ఉదయం నిర్మాత కే.ఎస్.రావు మురారికి ఫోన్ చేసి తన సొంత సినిమాకి రుద్రవీణ టైటిల్ ఇవ్వమని చిరంజీవి మిమ్మల్ని అడగమని అన్నారు. సరే అని ఆ తరువాత చిరంజీవి ఇంటికి వెళ్లి రుద్రవీణ టైటిల్ ని అంజనా సంస్థకి ఇస్తున్నట్టు లెటర్ రాసి ఇచ్చారు మురారి.
Also Read : కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి ఖాకి దుస్తుల కథ గురించి మీకు తెలుసా..?
ఆ సమయంలో క్రాంతికుమార్ దర్శకత్వంలో వెంకటేష్ తో సినిమా తీస్తున్నట్టు పేపర్ యాడ్ కూడా ఇచ్చారు. వెంకటేష్ కాళ్ల దగ్గర వీణను పెట్టి ఆ అర్థం వచ్చేలా చేశారు. సరస్వతి వీణను అలా కాళ్ల దగ్గర పెట్టడం మహాపాపం అని.. మహదేవన్ మురారిని మందలించాడట. డాక్టర్ రాజశేఖర్ నటించిన అంకుశం చిత్రం అప్పుడే విడుదలైంది. మురారి ఆ సినిమా చూశారు. రాజశేఖర్ బాగా చేశాడని అనుకున్నారు. రాజశేఖర్ మురారి దగ్గరికీ వచ్చి.. తనని తన తమ్ముడిగా హీరో పెట్టి ది వార్ లాంటి సినిమా తీయమని కోరారు. రాజశేఖర్ తమ్ముడు నటించిన సినిమా మురారి చూశారు. కానీ అతని నటన నచ్చలేదు. వెంకటేష్ తో రుద్రవీణ చిత్రంలో వెంకటేష్ హీరోగా తమ్ముడిగా ఓ పాత్ర ఉందని.. ఆ పాత్ర చేయాలని రాజశేఖర్ ని అడిగితే సరే అన్నారు. అక్కినేని-వాణి శ్రీ జంటగా నటించిన ఆత్మీయులు సినిమాని కాస్త అటు ఇటుగా మార్చి రుద్రవీణ చిత్రాన్ని తీద్దామనుకున్నారు. కథ విషయంలో చాలా రోజులు చర్చలు జరిగాయి. మురారి క్రాంతి కుమార్ చాలా సార్లు గొడవపడే వారు. చివరికీ ఇద్దరూ కలిసి పని చేయడం కష్టమని అర్థం కావడంతో డ్రాప్ అయ్యారు. అలా ఆ రుద్రవీణ ఆగిపోయింది. ఆ తరువాత కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని నిర్మించారు మురారి.
Also Read : కూలీ నుండి సినిమా వరకు.. గెటప్ శీను రియల్ లైఫ్ స్టోరీ..!!