సాధారణంగా రాజకీయాలు ఎప్పుడూ ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం దొరకడం అంతా ఈజీ కాదనే చెప్పాలి. అలాంటి అవకాశం వచ్చినప్పటికీ ఓ లీడర్ సమయానికి వెళ్లకపోవడం కారణంగా టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అవును. ఇది అక్షరాల సత్యం. ఈ ఘటన 1983 ఎన్నికల సమయంలో జరిగింది. నందమూరి తారకరామారావు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 1983 ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి మైనార్టీ వర్గానికి చెందిన న్యాయవాది నియామతుల్లాఖాన్ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.
Advertisement
నియామతుల్లాఖాన్ ఇంటికి టీడీపీ ఆఫీస్ నుంచి రాత్రి 9 గంటలకు సమాచారం వచ్చింది. తెల్లారి 4.30 గంటలకు హైదరాబాద్ గండిపేటలోని కుటీరానికి రావాలని చెప్పారు. ఆ రోజుల్లో రవాణా, సమాచార సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నియామతుల్లా ఖాన్ టికెట్ ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం స్నేహితులకు చెప్పారు. స్నేహితులు అభినందించి పార్టీ చేశారు. కుటీరానికి వెళ్లేందుకు కారు సిద్ధం చేశారు. ఎవరెవరు వెళ్లాలో నిర్ణయించారు. మబ్బుల 4.30 గంటలకు అందుబాటులో ఉండాలని వచ్చిన సమాచారాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆ సమయంలో ఎవ్వరూ ఉండరని చర్చించుకున్న ఫ్రెండ్స్.. ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకునేలా ప్లాన్ చేశఆరు. తీరా అక్కడికి వెళ్లే సరికి మబ్బుల 4 గంటల నుంచే టికెట్ ఖారారు అయిన అభ్యర్థులకు ఎన్టీఆర్ బీ ఫామ్స్ అందజేస్తున్నట్టు తెలిసింది.
Advertisement
నియమతుల్లాఖాన్ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన గురించి చెప్పగా.. ఉదయం 4.30 గంటలకు రమ్మని చెబితే.. 6.30 గంటలకు రావడం ఏంటి..? రెండు గంటలు ఆలస్యంగా వచ్చావని కోపపడ్డారు. సమయం పాటించని వారికి తన దగ్గర స్థానం లేదంటూ తిప్పి పంపించేశారు ఎన్టీఆర్. ఆ నియోజకవర్గానికి సెకండ్ ప్రియారిటీగా పరిశీలించిన డి.సాంబశివారావు చౌదరి పేరును నియామతుల్లాఖాన్ సమక్షంలోనే ప్రకటించి ఆయనకు బీఫామ్ అందజేశారు. ఆ ఎన్నికల్లో సాంబశివరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ భారీ విజయం సాధించడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ కోల్పోయానని నియామతుల్లా ఖాన్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి ? కేంద్రం సంకేతాలు ఇచ్చిందా ?
ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ మధ్య.. అసలు గొడవ ఏమిటి..? అప్పుడు అసలు జరిగింది అంటే..?