Home » బాలకృష్ణ-భూమిక కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా ?

బాలకృష్ణ-భూమిక కాంబినేషన్ లో మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే. ముఖ్యంగా ఒక దర్శకుడు అనుకొని మరో దర్శకుడు.. ఒక నిర్మాత అనుకొని మరో నిర్మాత.. ఇలా ఒక హీరో అనుకొని మరో హీరో.. హీరోయిన్ అనుకొని మరో హీరోయిన్ ని ఇలా సినిమా ప్రారంభం నుంచి ముగిసి పోయే చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుండటం మనం చూస్తేనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో చాలా అరుదైన కాంబినేషన్ ని కూడా మిస్ అవుతుంటాం. కొంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇప్పటివరకు కలిసి నటించని వారు కూడా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-నయనతార, పవన్ కళ్యాన్ – అనుష్క జంటగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ అది కుదరడం లేదు. 

Advertisement

అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ-భూమిక కాంబోలో ఓ సూపర్ డూపర్ హిట్ మూవీ మిస్ అయింది. ఆ చిత్రం చేసేందుకు బాలకృష్ణ కనుక ఓకే చెప్పినట్టయితే.. ఈ కాంబోలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీగా ఎప్పటికీ సినీ చరిత్రలో నిలిచిపోయి ఉండేది. కానీ ఆ చిత్రానికి బాలయ్య సైన్ చేయలేదు. ఆ సినిమా మరేదో కాదండోయ్.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి. ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తొలుత బాలయ్యకే  వినిపించారట. అప్పటికే నరసింహానాయుడు, సమరసింహారెడ్డి వంటి సినిమాలు చేసిన బాలయ్య.. పలనాటి బ్రహ్మానాయుడు ఫ్యాక్షన్ సినిమాకి ఓకే చెప్పాడట. ఇక అన్నీ ఫ్యాక్షన్ సినిమాలు అయితే బాగుండదని ఈ కథను వద్దన్నాడట బాలయ్య.  ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో వచ్చిన రెండో చిత్రం సింహాద్రి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమికను తీసుకోవాలని రాజమౌళి ముందే ఫిక్స్ అయ్యాడట. బాలయ్య-భూమిక కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని అనుకున్నారట. బాలయ్య నో చెప్పిన కథతో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టారు రాజమౌళి. సింహాద్రి మూవీలో మరో హీరోయిన్ గా అంకిత నటించింది. ఈ సినిమా తరువాత అంకిత, భూమిక ఇద్దరూ బాలయ్యతో కలిసి వేర్వేరు సినిమాల్లో నటించారు. బాలయ్య నటించిన విజయేంద్ర వర్మ మూవీలో అంకిత నటించగా..  భూమిక మాత్రం రూలర్ మూవీలో నటించారు. ఇందులో హీరోయిన్ గా కాకుండా.. సినిమాను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించింది భూమిక. అలా బాలయ్య సినిమాలో భూమికకి హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 “భోళా శంకర్” అట్టర్‌ ప్లాఫ్‌..భారీగా రెమ్యూనరేషన్‌ తగ్గించుకున్న చిరంజీవి ?

పోసాని కృష్ణమురళికి రూ.5 లక్షలు అప్పు ఇచ్చిన అల్లు అర్జున్ !

Visitors Are Also Reading