మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు వెండి తెరపై తిరుగులేని మగమహారాజు. శ్రీదేవి.. ఒకప్పుడు తెలుగుతెర అందాల రాణి. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా మోసగాడు సినిమా లో నటించారు. ఆతర్వాత రాణీకాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్ లాంటి సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే 1980 లో వీళ్ళిద్దరూ లీడింగ్ లో ఉన్న సూపర్ స్టార్స్. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రాకముందు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీయడానికి ఎంతో మంది డైరెక్టర్లు ప్రయత్నించారు. అందులో ఒక సినిమా వజ్రాల దొంగ. కోదండరామి రెడ్డి డైరెక్షన్లో చిరంజీవి,శ్రీదేవి జంటగా ఒక సినిమా తెరకెక్కడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమాను శ్రీదేవే నిర్మిస్తానని చెప్పింది. అయితే కథ దగ్గర పేచీ వచ్చింది. తాను నిర్మాత కాబట్టి ఇందులో హీరో పాత్ర కంటే తన పాత్ర ఎక్కువ ఉండాలని కండిషన్ పెట్టింది. దానికి చిరంజీవి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొండవీటి దొంగ అనే సినిమా ప్లానింగ్ జరుగుతోంది. దానికి శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు.దర్శకుడు కోదండరామిరెడ్డి. కథంతా విన్న శ్రీదేవి టైటిల్ మార్చమన్నది. కొండవీటి రాణి కొండవీటి దొంగ అని మార్చమని చెప్పింది. అంతేకాకుండా ఇందులో తన పాత్ర హీరో పాత్రతో సమానంగా ఉండాలని చెప్పింది. హీరో ప్రేమ ప్రేమ అంటూ తన చుట్టూ తిరగకూడదని కండిషన్స్ పెట్టింది. దాంతో ఇక్కడ కూడా చిరంజీవికి కోపం వచ్చింది. ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కి కూడా శ్రీదేవి పేచీ పెట్టింది. ముందుగా ఈ సినిమాకి జగదేకవీరుడు అనే టైటిల్ పెట్టారు. దానికి కూడా శ్రీదేవి అడ్డు చెప్పడంతో అతిలోక సుందరి టైటిల్ ని ఆడ్ చేసి సినిమా తీశారు. అలా శ్రీదేవి అడ్డుపడడంతో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన రెండు సినిమాలు బిగినింగ్ లోనే ఆగిపోయాయి.
Advertisement
ALSO READ;
Advertisement
విక్టరీ వెంకటేష్ కూతురుని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం..!
ఈ రాశులు గల అమ్మాయిలు.. అబ్బాయిలను ఒక్క చూపుతోనే పడేస్తారట.. ఎలా అంటే..?