ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెట్టుకున్నటువంటి సినిమాలకంటే ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. బిగ్ హిట్ కొట్టాలంటే.. బిగ్ బడ్జెట్.. బిగ్ స్టార్స్ ఎక్స్ పీరియన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ అవసరం లేదని ప్రూవ్ చేస్తున్నాయి. చిన్న సినిమాలు కొద్ది రోజులుగా మీరు గమనించినట్టయితే.. కమర్షియల్ సినిమాలంటే కథానుసారంగా సాగే సినిమాలు. కంటెంట్ ఉన్న సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఏదైనా కంటెంట్, ఫ్రెష్ నెస్ చాలా ముఖ్యం. ఇక గత ఏడాది లవ్ టుడ్,కాంతార సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి.
Advertisement
లవ్ టుడే చి వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?త్రం తమిళ, తెలుగు వరకే విడుదలయినప్పటికీ రూ.100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. కానీ కాంతార సినిమా ఊహించని స్థాయిలో పాన్ ఇండియాని షేక్ చేసిన విషయం విధితమే. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి.. రూపొందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. ఇక ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగానే జరుగుతుంటాయి. తాజాగా కాంతార కంటే తక్కువ బడ్జెట్ తో అనగా కేవలం రూ.2కోట్లతో తెరకెక్కిన ఓ మలయాళం సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్లను దాటి కలెక్షన్స్ రాబడుతూ ట్రెండ్ కొనసాగుతోంది.
Advertisement
Also Read : వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?
ప్రస్తుతం ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా తెరకెక్కిన మలయాళం చిన్న సినిమా ఇండస్ట్రీలో అందరూ చర్చించుకునేలా చేసింది. ఆ సినిమా పేరు రోమాంచమ్.. అంటే ఇంగ్లీషులో గూసుబంప్స్ అని అర్థం. ఇటీవల ఫిబ్రవరి 03న థియేటర్లలో విడుదలైన ఈ హరర్ కామెడీ సినిమాకి సంబంధించి యాక్టర్స్, టెక్నికల్ టీమ్ అందరూ కొత్తవాళ్లే. ఈ చిత్రం విడుదల చేసేందుకు కనీసం డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంతగా ఆసక్తి చూపించలేదట. అలాంటిది .. విడుదలైన తరువాత దుమ్ముదులుపుతూ నెల రోజుల్లోనే రూ.54కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. ఇప్పటికీ రోమాంచమ్ చిత్రం థియేటర్లలో రన్ అవుతోంది. రోమాంచమ్ మూవీ హిట్ అయిందని తెలిసేసరికి.. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు సమాాచారం. ఈ చిత్రాన్ని జీతూ మాధవన్ తెరకెక్కించగా.. జాన్ పాల్ జార్జ్, గిరీష్ గంగాధరన్, జోబి జార్జ్ సినిమా నిర్మించారు. తెలుగు ఆడియెన్స్ సైతం రోమాంచమ్ చిత్రం చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో ఎవరు విడుదల చేస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.