Home » ఎన్టీఆర్ – విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఏదో తెలుసా ?

ఎన్టీఆర్ – విజయ్ కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఏదో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకుండా అస్సలు ఉండదు. నూనూగు మీసాలు కూడా రాని వయస్సులోనే ఆయన ఇండస్ట్రీ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకొని స్టార్ హీరోలకు సైతం బెంబేలెత్తించాడు. సింహాద్రి సినిమా సూపర్ హిట్ అయిన తరువాత ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుందంటే.. చిరంజీవి కూడ తన సినిమాలను వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కి ఎన్నో డిజాస్టర్  వచ్చాయి. ఆ ఫ్లాప్స్ నుంచి తన తప్పులను తెలుసుకొని టెంపర్ సినిమా నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ కి సరికొత్త ఎన్టీఆర్ ని చూపిస్తున్నాడు.

Advertisement

ఆయన దురాభిమానుల ఎన్టీఆర్ కనీసం ఒక్కటంటే ఒక్క అట్టర్ ఫ్లాప్ సినిమా వస్తే బాగుండును అని కోరుకుంటున్నారు, కానీ ఎన్టీఆర్ ఆ అవకాశం ఎవ్వరికీ ఇవ్వడం లేదు.ఇక్కడ ఎన్టీఆర్ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో తమిళం లో తలపతి విజయ్ కూడా అదే ఫామ్ లో ఉన్నాడు.గత దశాబ్ద కాలం నుండి ఆయన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు.మాస్ లో ఎన్టీఆర్ లాగానే విజయ్  కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.ప్రస్తుతం ఇండియా లో మల్టీస్టార్రర్ ట్రెండ్ వేరే లెవెల్ లో నడుస్తున్న ఈ నేపథ్యం లో ఎన్టీఆర్ మరియు విజయ్ కలిసి ఎందుకు ఒక సినిమా చెయ్యకూడదు?, అనే ఆలోచన అభిమానుల్లో ఉన్నది.అయితే ఈ ఆలోచన కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, డైరెక్టర్స్ లో కూడా ఉంది.


ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ విజయ్ తో ఇప్పటి వారికి తుపాకీ, కత్తి , సర్కార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీశాడు. ఆయన వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ తీయాలని ఆలోచనలో చాలా రోజుల నుంచి ఉంది. ఈ సినిమా ని రెండు భాషల్లో సెపెరేట్ గా తీస్తారు అట. తమిళ భాషలో విజయ్ హీరో, ఎన్టీఆర్ విలన్.  అలాగే తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ హీరో, విజయ్ విలన్. ఇలా రోల్స్ రివర్స్ చేసి తీయాలని అనుకున్నాడట. గతం లో విక్రమ్ ‘రావణ్ ’ చిత్రాన్ని ఇలాగే తీసాడు డైరెక్టర్ మణిరత్నం. ఆ సినిమా సక్సెస్ అయింది. మళ్ళీ అదే ఫార్ములాతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ మురగదాస్. కానీ ఎందుకో ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ క్రేజీ మల్టీస్టార్ర్ర్ స్క్రిప్ట్ ని చెయ్యడానికి సుముఖత చూపలేదు.ఎందుకంటే అప్పట్లో ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అనే భయం ఉండేది. RRR తర్వాత ఆ భయాలు పోయాయి. భవిష్యత్తులో ఈ క్రేజీ మల్టీస్ట్రారర్ తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading