మామూలుగా మాతృత్వం అంటే మరిచిపోలేని అనుభూతి. ఒక మహిళ జీవితం పూర్తయ్యేది తల్లి అయిన తరువాతే అంటుంటారు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లికి మరో దేవతయ్యే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. పుట్టిన బిడ్డ జీవితాంతం బిడ్డగానే ఉంటే మరి ఆ తల్లి భరించగలదా..? వయస్సు పెరుగుతున్న బుద్ధి పెరగకపోవడంతో వెన్నెలైనా కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది చాలా మందికి. ఆ పరిస్తితిలో తల్లికి బిడ్డ భారమవుతుందా..? సాధారణ మహిళ అయితే ఏమో అనుకోవచ్చు కానీ సెలబ్రిటీల పిల్లలు సైతం బుద్దిమాంద్యంతో జన్మిస్తే జీవితాంతం తోడు ఉండాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. బుద్ది మాంద్యం కలిగిన ఉన్న పిల్లలు మన సెలబ్రిటీస్‌లలో ఎవరికీ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కవిత :
అలనాటి స్టార్ హీరోయిన్ అయినటువంటి కవిత ప్రస్తుతం తల్లి పాత్రలో నటిస్తూ రాజకీయాల్లో బిజీగా గడుపుతోంది. కానీ ఈ కవిత కుమారుడు చిన్ననాటి నుంచే బుద్ధిమాంద్యంతో బాధపడేవాడు. అయితే దురృష్టవశాత్తు కరోనా బారిన పడి కొన్నాళ్ల కిందట మరణించాడు.
పృథ్విరాజ్ :
పృథ్విరాజ్ బాలనటుడిగా తన నటనను ప్రారంభించాడు. కన్నడలో బబ్లూగా బిజీ స్టార్ అయ్యాడు. తెలుగులో 1980లో కే.బాలచందర్ దర్శకత్వం వహించినటువంటి వానమే ఎల్లై అనే సినిమాలో నటించాడు. ఇక ఆ తరువాత చాలా సినిమాల్లో నటించాడు. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం ఇలా సౌత్ ఇండియా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. పృథ్వికి ఓ కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం 20 ఏళ్ల తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. తన కుమారుడి ఆరోగ్య మానసిక స్థితి సరిగ్గా లేకున్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
Advertisement
నటి ఇందు ఆనంద్ :
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇందు ఆనంద్. మంజుల నాయుడు సీరియల్స్ ద్వారా 50 ఏళ్ల వయసులో నటిగా పరిచయమైంది. ఆమె కూతురు బుద్ధి మాంద్యంతో బాధపడుతూ ఉండడంతో తన కన్నకూతురు మరణించిన తరువాత తాను చనిపోవాలని కోరుకుంటున్నట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తన కూతురుకు జన్మతః మానసిక ఎదుగుదల లేదని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇందు ఆనంద్ వెల్లడించారు. తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని.. అప్పటి నుంచి కష్టపడుతున్నట్టు చెప్పారు.
ఇది కూడా చదవండి : దుర్భర జీవితం గడుపుతున్న స్టార్ హీరో భార్య.. కూరగాయలు అమ్ముకుంటూ..!!
పావల శ్యామల :
ఈమె జీవితం చిన్నతనంలోనే ఓ నాటకీయంగా మలుపుతిరిగింది. 13 ఏళ్లకే పెళ్లి అయింది. 16 ఏళ్లకే ఈమె భర్త మరణించాడు. అప్పటికే ఈమెకు ఇద్దరు పిల్లలు. కుటుంబ పోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగా కొనసాగించారు. దాదాపు 44 ఏళ్లుగా నాటకాలు, సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన ఈమె ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈమె పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేష్ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఈమె పరిస్థితి ఇలా ఉంటే.. బుద్ధి మాంద్యంతో కలిగిన కూతురు ఉండడంతో కూతురు బాగోగులు చూసుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి క్రమక్రమంగా దూరమైపోయింది. ప్రస్తుతం మగ్గిపోయో మంచంపై ఉంది. అయినప్పటికీ కుమార్తె బాగోగులు శ్యామల చూస్తుంది.
ఇది కూడా చదవండి : నువ్వులు, ఉసిరి మీ ఇంట్లో ఉంటే తెల్లజుట్టు నల్లగా మారాల్సిందే..!