పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన సినీ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన సినిమా జానీ. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తో కలిసి నటించిన ఈ చిత్రం 2003 ఏప్రిల్ 25 విడుదల విడులైంది. కనివినీ ఎరుగని రీతిలో ప్రపంచ వ్యాప్తంగా 250 ప్రింట్లతో విడుదల అయింది. ఈ చిత్రానికి సినిమా కమర్షియల్‌గా హిట్ కాలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ చిత్రం విషయంలో ప్రయోగాలు జరిగాయి.
పవన్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది జానీ మూవీ. ఈ చిత్రం విషయంలో జరిగిన ప్రయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా ఫైట్స్ కోసం లాస్ ఏంజిల్స్‌లో మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఐక్విడో కోసం జపాన్ కి వెళ్లాడు. అక్కడ ప్రత్యేక నిపుణుడి పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో సాధారణ యువకుడిగా కనిపించడం కోసం పవన్ గుండు కొట్టించుకున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ వచ్చేవిధంగా జుట్టు పెంచుకున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా పవన్ కళ్యాణ్ రాశాడట.
Advertisement
Advertisement
Also Read : భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని అవమానాలు NTR పడ్డారంటే ?
ఇక ఈ చిత్రానికి 90 శాతం లైవ్ రికార్డింగ్ చేశారు. డబ్బింగ్ లేకుండా షూటింగ్ స్పాట్‌లో చెప్పిన డైలాగ్‌లను ఫైనల్ అవుట్ పుట్ లో పెట్టారు. ఈ చిత్రంలో రెండుపాటలను పవన్ కళ్యాణ్ పాడాడు. వాస్తవానికి ఈ సినిమాలో పవన్ రాసుకున్న కథలో హీరో చనిపోవాలి. కానీ అభిమానులు ఏమనుకుంటారో అని భావించి కథను మార్చారట. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Also Read : ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీశాడా..?