Home » hai nanna child artist : హాయ్ నాన్నా చిత్రంలో నానికి కూతురుగా నటిస్తున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?

hai nanna child artist : హాయ్ నాన్నా చిత్రంలో నానికి కూతురుగా నటిస్తున్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?

by Mounika
Ad

నేచురల్ స్టార్ నాని మరియు మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న రాబోయే చిత్రానికి “హాయ్ నాన్నా” అని పేరు పెట్టారు. ఈ చిత్రంతో శౌర్యువ్‌ అనే యువ దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.  ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా శృతిహాసన్ కూడా కనిపించబోతుంది. ఈ చిత్రంతోనే మలయాళంలో సంచలన విజయం సాధించిన హృదయం మూవీకి సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు.

Advertisement

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా హాయ్‌ నాన్నచిత్రాని నిర్మిస్తున్నారు. మేకర్స్ గత గురువారం హాయ్‌ నాన్న చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఇది నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థమవుతుంది.

ఈ గ్లింప్స్‌లో నాని, మృణాళ్‌తో పాటు ఓ పాప స్పెషల్ గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈ పాప ఎవరు అంటూ వెతుకులాట మొదలైంది. ఈ చిత్రంలో నాని కూతురుగా కనిపించబోతున్న ఈ చిన్నారి పేరు కియారా ఖన్నా. ఈ చిన్నారికి ఇదే తొలి సినిమా అనుకుంటే పొరపాటు పడినట్లే.. నాని సినిమా కంటే ముందే పలు బాలీవుడ్ సినిమాల్లో కూడా కియారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. కేవలం సినిమాలోనే కాకుండా పలు ప్రకటనలో కూడా ఈ చిన్నారి నటించింది.


బాలీవుడ్ లో థ్యాంక్ గాడ్, బందా సింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి హిందీ చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కియారా ఖన్నా మైరా కియారా అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ ద్వారా 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. అంతేకాదు.. ఈమెకు మైరా & కియారా పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక నాని నటించే 30వ చిత్రం గా తెరకెక్కబోతున్న హాయ్ నాన్నా మూవీ ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన 8 గురు నటులు.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి!

ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె డాన్స్ కి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే..!

నిహారిక విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి?

 

Visitors Are Also Reading