Home » దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య గురించి మీకు తెలుసా ? సెట్ లోనే సెలబ్రేషన్స్..!

దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య గురించి మీకు తెలుసా ? సెట్ లోనే సెలబ్రేషన్స్..!

by Anji
Ad

కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కి, ఇటు హీరో యశ్ కి మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సలార్ మూవీ సెట్స్ పై తన భార్యతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ షూటింగ్ లొకేషన్ లో ప్రశాంత్ నీల్ భార్య లిఖిత సందడి చేసింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  

Also Read :  Sad Quotes Telugu : ఈ కోట్స్ తో మీ జీవితం మారడం పక్కా..!

Advertisement

ప్రశాంత్ నీల్, లిఖితల పెళ్లి జరిగి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయిందట. ప్రశాంత్ నీల్ దంపతులకు పలువురు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొందరూ నెటిజన్లు ఈ ఫొటోలో రెబల్ స్టార్ ప్రభాస్ ఎక్కడ ? అని వెతుకుతున్నారు నెటిజన్లు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవైటేడ్ సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.  

Advertisement

Also Read : కృష్ణ తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోను అంటూ ANR ఎందుకు అన్నారు ?

Manam News

సలార్ మూవీలో ప్రభాస్ కి జోడిగా  శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జగపతి బాబు, మలయాళ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ బాణీలను సమకూర్చుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నడూ చూడని రీతిలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో ఉండనున్నాయట. అందుకు తగినట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.. సలార్ తో మళ్లీ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ మూవీతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  

Also Read :   కాసేపట్లో పెళ్లి.. పెళ్లి కూతురు చేసిన పనికి షాక్ లో కుటుంబ సభ్యులు..!

Visitors Are Also Reading