సాధారణంగా మానవ శరీరంలో పుట్టమచ్చలు ఉంటాయి. ఇవి కొందరికీ తక్కువ ఉంటాయి. మరికొందరికీ ఎక్కువగా ఉంటాయి. ఈ పుట్టమచ్చలు నలుపు, గోధుమ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఇటువంటి పుట్టుమచ్చలు ముఖంపై ఉండడం ద్వారా కొందరూ అందంగా కనిపిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని చోట్ల పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టాన్ని కలిగిస్తుంది. మరికొన్ని సార్లు అవి దురదృష్టాన్ని కూడా సూచిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీ ముఖం మీద పుట్టుమచ్చలు ఏం చెబుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
స్త్రీ లేదా పురుషులు ఎవరైనా ఎడమ చెంపపై పుట్టు మచ్చ ఉంటే వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుందట. అలాంటి వారికి వైవాహిక జీవితంలో ఎలాంటి కష్టాలు రావట. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుందట. మీ పెదవి దగ్గర పుట్టమచ్చ ఉన్నట్టయితే దానికి చాలా అర్థాలే ఉంటాయి. పెదవి కింద పుట్టుమచ్చ ఉంటే.. మీరు సంతోషంగా సంపన్నమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేస్తుంది. ఏదైనా సాధించాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పెదవి పై ఉన్న పుట్టమచ్చ. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, అందాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. అలాంటి వారికి ఖరదైన వస్తువులను ఉపయోగించడం చాలా ఇష్టంగా ఉంటుందట.
Advertisement
ఇది కూడా చదవండి : ఉదయ్ కిరణ్ డైరీ అల్లు అరవింద్ చేతిలో.. సంచలన నిజాలు బయటపెట్టిన మురళీ మోహన్
రెండు కనుబొమ్మల మధ్య పుట్టమచ్చ ఉన్న వారు ఉదార హృదయలు అని, వారు ఇతరులకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో నుదిటిపై పుట్టమచ్చ గలవారు జీవితంలో ఏది సాధించాలన్నా.. చాలా కృషి చేసిన తరువాతనే పొందుతారట. ముక్కుపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు పలు రకాల ప్రతిభ నైపుణ్యాలు కలిగి ఉంటారట. వారికి త్వరగా కోపం వస్తుందట. కుడి చెంపపై పుట్టుమచ్చ కలిగిన వ్యక్తి చాలా తెలివైన వాడు అని తెలుస్తోంది. అలాంటి వ్యక్తులు తమ విధి కంఏట తమను తాము అధికంగా నమ్ముకుంటారు. ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే దాని కోసం విపరీతంగా కృషి చేస్తారట. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి హృదయాన్ని కలిగి ఉంటారట. గడ్డంపై కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారు కళాత్మక భావనలతో సంతోషంగా ఉంటారట. ఆ గడ్డానికి ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్న వ్యక్తిని నీచంగా చూస్తారని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.
ఇది కూడా చదవండి : అధిక బరువు ఉన్న వారు చికెన్ అస్సలు తినకూడదు.. జాగ్రత్త..!