Home » మధ్యాహ్నం భోజనం తరువాత మీకు నిద్ర వస్తుందా ? అయితే ఇలా చేయండి..!

మధ్యాహ్నం భోజనం తరువాత మీకు నిద్ర వస్తుందా ? అయితే ఇలా చేయండి..!

by Anji
Ad

సాధారణంగా మధ్యాహ్నం భోజనం తరువాత నిద్రమత్తుగా ఉండడం అందరికీ తెలిసిందే. కొందరికీ కాసేపు ఓ కునుకు తీస్తే కానీ కాస్త హుషారు రాదు. అసలు అన్నం తర్వాత మత్తుగా ఎందుకు అనిపిస్తుంది. దీనికి కారణం అన్నంలోని గ్లూకోజు రక్తంలో వేగంగా కలవడమే. ఇక అంతే కాదు.. అన్నంతో ప్రశాంతతను కలుగజేసే మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. కేవలం అన్నం మాత్రమే కాదు.. కొన్ని రకాల పిండి పదార్థాలతోనూ ఇదే భావన కలుగుతుంది. మరీ దీనికి పరిష్కారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  • సాధారణంగా మధ్యాహ్నం సమయానికి మానసిక శక్తి సన్నగిల్లుతుంది. దీనికి అన్నం తోడు అయితే నిద్ర ముంచుకొస్తుంది. కాస్త ప్రోటిన్ ఎక్కువగా గల ఆహారం మంచిది. ఇది డోపమైన్, ఎపినెఫ్రిన్ వంటి చురుకైన రసాయనాలను మెదడు సంశ్లోషించుకోవడానికి తోడ్పడుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. పనుల్లో వేగం పుంజుకుంటుంది. 

Lunch : Manam News

Advertisement

  • అన్నం తినకుండా ఉండలేకపోతే సాధారణ బియ్యం కంటే పొడవైనా బాస్మతి బియ్యం వాడుకోవడం మంచిది. వీటిలో గ్లూకోజు అంత త్వరగా రక్తంలో కలవదు. అలా అని పుష్టుగా తింటారేమో. కొద్దిగా తినేలా మాత్రమే చూసుకోవాలి. 

Also Read :   ఈ 5ల‌క్ష‌ణాలు ఉన్న పురుషుల‌ను స్త్రీలు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ట‌..! 3వది చాలా ముఖ్య‌మైన‌ది..!

Jonna Rotte : Manam News

  • అన్నంకి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినవచ్చు. రొట్టెలతో పాటు పన్నీరు లేదా సోయానగెట్స్ తీసుకోవచ్చు. మాంసాహారులు అయితే కూరగాయలు, సలాడ్ తో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో భోజనం తరువాత నిద్ర రాకుండా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. 

Also Read :  మీ దంతాలలో రక్తం కనిపిస్తుందా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే జాగ్రత్త..!

Visitors Are Also Reading