సాధారణంగా మన ఆహార అలవాట్లను బట్టే జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థల పనితీరుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే మలబద్ధకం రూపంలో అవస్థ తప్పదు. అందుకే కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే.. జీర్ణవ్యవస్థ మెరుగు అవుతుంది. ఉదయం అల్పాహారం చాలా ఘనంగా మధ్యాహ్నం భోజనం సామాన్యంగా.. రాత్రి భోజనం మితంగా తీసుకోవాలి. భోజనాన్ని హడావుడిగా కాకుండా నిదానంగా చేయాలి. దీంతో లాలాజలం ఎక్కువగా ఊరి.. జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది.
Advertisement
అల్లం టీ :
చల్ల గాలికి వెచ్చని టీ తాగతుంటే.. ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణం వరకే ఉంటుంది. దానికి తోడు అల్లం చేర్చుకోండి. జీర్ణప్రక్రియను వేగవంతం చేయడమే కాదు.. శరీరాన్ని వెచ్చబరుస్తుంది.
Also Read : మంటల్లో కాలిపోతున్న విజయశాంతిని ప్రాణాలకు తెగించి కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
దాల్చిన చెక్క టీ :
Advertisement
దాల్చిన చెక్కని మనం మసాలా దినుసులలో విరివిగా వాడుతాం. దీనిని తాగడం వల్ల ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అలాగే స్కిన్ మెరిసేవిధంగా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న దాల్చిన చెక్క క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. వీటితో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
నీరు :
నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే.. ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగండి. గోరు వెచ్చగా ఉంటే.. మరింత మంచిది. జీర్ణసమస్యలు, పలు సమస్యలకు నీరు పరిష్కారం చూపిస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి రెమిడీలా పని చేస్తుంది.
యాలకులు :
యాలకులతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమై శరీరానికి తగినంత జీవశక్తిని ఇస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకుల్లో ఉంది. ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, గింజల లాంటివి తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి.
Also Read : మినపప్పు వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!