ప్రతి అమ్మాయికి తన భర్త గురించి చాలా ఆలోచనలు ఉంటాయి. తన భర్త తన గురించి మాత్రమే ఆలోచించాలి అని.. తనని మాత్రమే ప్రేమించాలి అన్న ఆలోచనలు ఉంటాయి. అయితే అందుకోసం భార్యలు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. కేవలం ప్రేమ అనే ఒక్క విషయం భార్యాభర్తల బంధం జీవిత కాలం నిలబడడానికి సరిపోదు. ఆ ప్రేమ జీవితాంతం ఉండాలంటే.. మీరు కొన్ని మీ భర్త అలవాట్లకు తగ్గట్లుగా కొన్ని పనులు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూసేయడం.
Advertisement
ఏకీభవించడం:
ప్రతి భార్య తన భర్త మాటలతో ఏకీభవించడం మొదటగా చెయ్యాల్సిన పని. అన్ని విషయాలను మీకు ఇష్టం లేకపోయినా మీ అభిప్రాయాలను చంపుకుని ఏకీభవించక్కర్లేదు. మీరు ఓ వైపు అంగీకరిస్తూనే మరోవైపు మీ వైపు ఆలోచనని సున్నితంగా తెలియచేయవచ్చు.
2. అతని భాషలో అతన్ని ప్రేమించండి
మీ భర్త పట్ల ప్రేమను అతను ఎలా అర్ధం చేసుకోగలుగుతాడో తెలుసుకుని చూపించాడు. మీ వైపు నుంచి మాత్రమే కాకుండా.. అతని వైపు నుంచి ఆలోచన చేసి ప్రేమించండి. అతను ఇంటికి వచ్చేసరికి అతనికి నచ్చినట్లుగా ఇంటిని సర్ది ఉంచుకోండి. ఉదయాన్నే అపరిశుభ్రంగా ఎదురు వచ్చే బదులు.. చక్కగా స్నానం చేసి శుభ్రంగా కనిపించండి. ఇవి చిన్నవే అయినా మీ భర్తపై చాలా ప్రభావం చూపిస్తాయి.
Advertisement
3. అతన్ని ఫ్లర్ట్ చెయ్యండి:
అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా ఫ్లర్ట్ చెయ్యచ్చు. చిన్న చిన్న పొగడ్తలు, మృదువైన స్పర్శ, హగ్స్, ముద్దులు మీ బంధాన్ని మరింత దగ్గర చేస్తాయి.
4. అతనికి అందుబాటులో ఉండండి
అన్ని విధాలుగా, మీ భర్తకు మిమ్మల్ని మీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. మీ సమయాన్ని అతనికి ఉదారంగా బహుమతిగా ఇవ్వండి, అతని అవసరాలను ప్రేమగా నెరవేర్చండి. సాన్నిహిత్యం కోసం మానసికంగా మరియు శారీరకంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలని నిర్ధారించుకోండి. మీ ప్రయత్నాల్ని మీ భర్త గుర్తిస్తే మీ బంధం మరింత పదిలం అవుతుంది.
5. అతని వ్యక్తిత్వాన్ని మార్చకండి:
ఇది చాల కష్టమైనది. మీకోసం మారమని ఒత్తిడి చెయ్యడం కంటే మీ భర్తని తన స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోనివ్వకుండా ఉండడం చాల మేలు చేస్తుంది. ఇది కష్టమైనా.. అతన్ని అతనిలా ఉండనివ్వండి. మీ ఉనికి మీకు ఎలా ముఖ్యమో.. అతని ఉనికి అతనికి ముఖ్యం అన్న విషయాన్నీ గుర్తించండి.
మరిన్ని..
ఆరు పదులు దాటాయా..? అయితే కచ్చితంగా వీటిని పాటించండి.. ఇంకా ఆరోగ్యంగా ఉండచ్చు..!
అతిగా చెమట పడుతోందా..? అయితే ఇలా మీరు తగ్గించుకోవచ్చు…!
చాణక్య నీతి: కష్ట సమయంలో వీటిని తప్పక ఆచరించండి…!