చాలామంది రెగ్యులర్ గా డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు ఎక్కువ ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన అనేక లాభాలను పొందవచ్చు. నట్స్ ని తీసుకుంటే చక్కటి ప్రయోజనాలు ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలు కూడా మనం పొందవచ్చు. షుగర్ కూడా వీటిని తీసుకోవడం వలన కంట్రోల్ లో ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడానికి బాదం బాగా ఉపయోగపడుతుంది. ఆకలిని కూడా బాదం తగ్గిస్తుంది నట్స్ లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.
Advertisement
Advertisement
అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోతారు. అయితే వీటిని తినడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. బాదం, పిస్తాని రోజుకి 5 నుండి 6 తినొచ్చు. భోజనానికి భోజనానికి మధ్యలో తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్ని నట్స్ ని మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే కొన్ని నట్స్ ని మాత్రమే తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నట్స్ తీసుకోవడం మంచిది. గింజలని రాత్రి నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకుంటే ఇబ్బంది పడాలి. అలానే కొంతమంది ఉప్పు కారం మసాలా వంటివి జల్లుకుని జీడిపప్పు మొదలైన వాటిని తీసుకుంటూ ఉంటారు అది తప్పు.
Also read:
- పేలు బాధ భరించలేకపోతున్నారా..? ఇలా సులభంగా వదిలించచ్చు…!
- చాణక్య నీతి: కష్టాల్లో ఈ 4 విషయాలు.. అస్సలు మరిచిపోవద్దు..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ధనలాభం పొందుతారు