Home » జేబులో పెట్టుకునే పర్సులో.. ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు !

జేబులో పెట్టుకునే పర్సులో.. ఈ వస్తువులు అస్సలు పెట్టొద్దు !

by Bunty
Ad

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ… వారి జేబులో పర్సు మెయింటెన్ చేస్తారు. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా అందులో దాచుకొని… జీవనం సాగిస్తున్నారు. అయితే పర్సులో పెట్టుకుని డబ్బును.. మీరు పర్సులో పెట్టుకునే వస్తువులు ఆకర్షిస్తాయి. అది పాజిటివ్ గా ఉంటే డబ్బు వస్తుంది… అదే నెగిటివ్ గా ఉంటే దరిద్రం చుట్టుకుంటుంది. చాలా మంది పురుషుల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటోలు పెడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఫోటోలను పర్సులో అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా పర్సులో మాత్రం పెట్టకూడదు. దీని వల్ల డబ్బు పోవడమే తప్ప రావడం అసలు ఉండదు.

Also Read: మృత్యువుతో వీరుడి పోరాటం…బ్యాక్ బెంచ్ స్టూడెంట్ల కోసం రాసిన లేఖ వైర‌ల్..!

Advertisement

పర్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దాంట్లో ఏది పడితే అది పెట్టకూడదు. కాగితాలు, ఇతర పేపర్స్ కూడా దాచకూడదు. ఏటీఎం కార్డ్ స్లిప్పులు, ఇతర బిల్లులు అలాగే పేపర్లతో అస్సలు నింపకండి. అలా చేస్తే డబ్బు కూడా ఎలా వచ్చిందో అలాగే పోతుంది. పర్సు ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి పేపర్స్ మరియు బిల్స్ అందులో పెట్టకూడదు. చాలామంది పర్సులు కింద పడేస్తూ ఉంటారు. నేలమీద వేస్తుంటారు. అలా ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే డబ్బు అంటే లక్ష్మి తో సమానం. డబ్బుతో ఉన్న పర్సన్ కిందపడితే లక్ష్మి దేవతను అవమానించినట్టే.

Advertisement

ఆఫీసులో గాని.. బయటికి వెళ్లినప్పుడు గాని.. పర్సు ను మాత్రం అస్సలు కింద పెట్టకూడదు. పర్సులో చాలామంది కాయిన్స్ దాచి పెడతారు. పర్సులో కాయిన్స్ ను అస్సలు పెట్టుకోకూడదు. ఎందుకంటే కాయిన్స్ పెట్టడం వల్ల పర్సు బరువెక్కుతుంది. ముఖ్యంగా చిరిగిపోయిన పర్సన్ అస్సలు వాడకండి. అది చాలా డేంజర్. చిరిగిపోయిన పర్సనల్ వాడటం కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. అలాగే అది నెగిటివ్ ఎనర్జీ ని క్రియేట్ చేసి డబ్బు కోల్పోయేలా చేస్తుంది.

పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి :

మనం పర్సులో లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటోలు పెట్టుకోవాలి. అలాగే రెండు ఏనుగులు ఉన్న ఫోటోలు పెట్టుకుంటే ఇంకా బెటర్. కుదిరితే రావి ఆకులు పర్సులో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ తో పాటు డబ్బులు పుష్కలంగా వస్తాయి. వీలు కుదిరితే వెండి కాయిన్స్ పెట్టుకుంటే మీ దశ తిరిగిపోతుంది.

Also Read: మెగా ఫాన్స్ కు షాక్.. “గని ” రిలీజ్ కు బ్రేకులు

Visitors Are Also Reading