Home » మెగా ఫాన్స్ కు షాక్.. “గని ” రిలీజ్ కు బ్రేకులు

మెగా ఫాన్స్ కు షాక్.. “గని ” రిలీజ్ కు బ్రేకులు

by Bunty

వరుస హిట్లతో వరుణ్ తేజ్ దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం గని సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినాస్సాన్స్ ఫిలిమ్స్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్దు ముద్ద మరియు ఆలు వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు పాటలు ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అంతేకాదు ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అయితే కాజా గా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది గని సినిమా బృందం. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా వదిలింది చిత్రబృందం. త్వరలోనే.. కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా స్పష్టం చేసింది గని టీం. దీంతో మెగా ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది.

Visitors Are Also Reading