వాస్తు ప్రకారం.. కొన్ని వస్తువులను మంచం మీద పడితే ఆశుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల వస్తువులను మంచం మీద పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తలెత్తడంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. మంచం మీద కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు వెంటాడుతుంటాయట. ఎలాంటి వస్తువులను పెడితే నష్టాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా మంచం మీద కొన్ని రకాల వస్తువులను పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీంతో లక్ష్మీదేవి ఇంటిని వీడి పెళ్లిపోతుందట. మంచం మీడ పసుపు, కుంకుమ అస్సలు పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం కావడంతో మంచి మీద ఎప్పుడు అత్యంత పవిత్రంగా భావించే పసుపు, కుంకుమలను ఉంచకూడదు. పూజా సామానులను పండ్లు, తమలపాకులు పెట్టకూడదు. భగవంతునికి పెట్టడానికి తీసుకొచ్చిన నైవిద్యంను కూడా మంచం మీద పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల వాటిలో ఉండే దైవికమైన శక్తి నశించి మామూలు వస్తువులుగా మిగిలిపోతాయి అని నిపుణులు వెల్లడించారు. అందుకే మంచం మీద దేవుడికి నివేదించే పదార్థాలను దేవుడి దగ్గర పెట్టే సామాన్లను పెట్టకూడదు.
Advertisement
ఇది కూడా చదవండి : పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ…వరుడు ఎవరంటే..?
ముత్యాలను కూడా ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు. మంచంపై సాలగ్రామాలు, రుద్రాక్షలు ఎప్పుడూ పెట్టకూడదు. వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు మంచంపై పెట్టకూడదు. మరకత ఆభరణాలను కూడా మంచంపై పెట్టకూడదు. మంచంపై ఇలాంటి వస్తువులను పెట్టడం ద్వారా ఐశ్వర్ం అంతా హరించుకుపోతుందట. అదేవిధంగా చాలా మంది ఇండ్లలో బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు బయటికి తీసి తరువాత వాటిని వెంటనే మంచం మీద పెట్టి చూసుకుంటారు. అలా చేయడం వల్ల నష్టం వాటిల్లుతుంది. మంచం మీద బంగారం పెట్టడం వల్ల మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తుతుందని, పెద్ద దోశానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మంచం మీద దేవుడి ఫోటోలను కూడా అస్సలు పెట్టవద్దు. ఈ వస్తువులు పెడితే మీకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : మీ ఆహారంలో టోఫును చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే దాన్ని వదలరు..!