Home » టీ ని పదేపదే వేడి చేస్తున్నారా..? ఇది చూస్తే.. ఇక మీదట ఆ తప్పు చెయ్యరు…!

టీ ని పదేపదే వేడి చేస్తున్నారా..? ఇది చూస్తే.. ఇక మీదట ఆ తప్పు చెయ్యరు…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు కూడా టీ, కాఫీ లని రోజు తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీలని తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అతిగా టీ కాఫీలను తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఎక్కువగా చాలామంది టీ విషయంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ పొరపాట్లని అసలు చేయకుండా చూసుకోండి. ఒకసారి టీ పెట్టుకున్నాక మళ్ళీ మళ్ళీ వేడి చేసి తీసుకోకూడదు. టీ కాచిన తర్వాత దానిలో ఫంగస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. దీంతో కొన్ని ప్రమాదకరమైన సమస్యలు కలగవచ్చు.

Advertisement

ముఖ్యంగా పాలతో చేసిన టీ వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే హెర్బల్ టీ ని తయారు చేసినప్పుడు, మళ్ళీ మళ్ళీ వేడి చేయకండి. దాని వలన పోషకాలు బాగా తగ్గిపోతాయి. టీ ని పదేపదే వేడి చేస్తే ఉదర సంబంధిత సమస్యలు, విరోచనాలు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. టీ తయారు చేయడానికి ఉపయోగించే టీ పొడి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడానికి సహాయపడుతుంది. రోజూ టీ తాగితే రక్తపోటు కొద్దిగా తగ్గుతుంది. గుండెజబ్బులు రేటుని 10% తగ్గిస్తుంది. సో టీ ని పదేపదే వేడి చేసి తీసుకోవద్దు. పాయిజన్ గా మారవచ్చు.

Advertisement

Also read:

Visitors Are Also Reading