Home » వంటగదిలో ఇవి అస్సలు వుండకూడదు.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..!

వంటగదిలో ఇవి అస్సలు వుండకూడదు.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..!

by Sravya
Ad

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అయితే వాస్తు ప్రకారం వంటగదిలో ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఉంచకూడదు. ఇవి వంటగదిలో ఉంటే ఇబ్బందులు వస్తాయి. వాస్తు ప్రకారం వంటింట్లో డస్ట్ బిన్ పెట్టకూడదు ఇది నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. పాజిటివ్ ఎనర్జీ దూరం చేస్తుంది. అలానే వంటగదిలో ఎప్పుడూ మందులు పెట్టకూడదు. వంటగదిలో మందులు పెడితే ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. విరిగిపోయిన లేదంటే పగిలిపోయిన వస్తువులని వాస్తు ప్రకారం వండింట్లో పెట్టకూడదు. ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి కోపం కలుగుతుంది.

Advertisement

Advertisement

అలానే దురదృష్టం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి. వంటింట్లో అద్దం పెట్టకూడదు వంటింట్లో అద్దం పెడితే కూడా అసలు మంచిది కాదు. వాస్తు ప్రకారం వంటింట్లో చీపురు పెట్టడం కూడా తప్పు. ఇలా కూడా జరగకుండా చూసుకోండి. ఇలా వాస్తు ప్రకారం వీటిని అస్సలు వంటింట్లో పెట్టకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading