Home » ఈ మూడు ప‌దార్థాలు తిన్న త‌రువాత వేడినీరు, చాయ్ అస్స‌లు తాగ‌కూడ‌దు..అవి ఏమిటంటే..?

ఈ మూడు ప‌దార్థాలు తిన్న త‌రువాత వేడినీరు, చాయ్ అస్స‌లు తాగ‌కూడ‌దు..అవి ఏమిటంటే..?

by Anji
Ad

ఏదైనా ఆహారం తీసుకున్న త‌రువాత చాలా మందికి నీరు తాగే అల‌వాటు ఉంటుంది. క‌రోనా వ‌చ్చిన త‌రువాత ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ‌గా వేడి నీరు తీసుకుంటున్నారు. కానీ త‌ర‌చూ వేడి నీరు తీసుకోవ‌డం చాలా ప్ర‌మాద‌మే అని చెప్పాలి. ఆహారం తీసుకునేట‌ప్పుడు లేదా తీసుకున్న‌త‌రువాత వేడి నీరు లేదా ఛాయ్ అస్స‌లు తీసుకోవ‌ద్దు. ఈ విధంగా తాగ‌డంతో అనారోగ్య స‌మ‌స్య‌లు సంభ‌విస్తుంటాయి. ప్ర‌ధానంగా మూడు ప‌దార్థాలు తీసుకున్న త‌రువాత వేడినీరు లేదా హాట్ డ్రింక్స్ చాయ్, కాఫీ అస్స‌లు తీసుకోకూడ‌దు. ఆ ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


పెరుగు :

Advertisement

వ‌ర్షాకాలంలో పాలు, పెరుగు అస్స‌లు తీసుకోవ‌ద్దు. కానీ పెరుగు తిన్న త‌రువాత వేడి నీరు లేదా చాయ్ తీసుకోవ‌ద్దు. అవును నిజ‌మే పెరుగు తీసుకున్న త‌రువాత వేడినీరు, చాయ్ వంటి హాట్ డ్రింక్స్ మాత్రం తీసుకోవ‌ద్దు.

తేనె :

Advertisement

తేనె ఇష్ట‌ప‌డ‌ని వారు అస‌లు ఈ భూమి మీద ఎవ్వ‌రూ ఉండ‌రు. చాలా మంది బ‌రువు త‌గ్గించుకునేందుకు తేనెనుఉప‌యోగిస్తారు. ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌కాయ తేనె క‌లిపి తాగ‌డం ద్వారా బ‌రువు త‌గ్గుతార‌ని చాలా మంది న‌మ్ముతుంటారు. తేనెను ఎప్పుడు వేడి నీళ్ల‌తో కలిపి తీసుకోవ‌ద్దు. ఒక‌వేళ తేనె తిన్న‌త‌రువాత కూడా వేడి నీళ్లు తాగ‌కూడ‌దు.

మ‌ద్యం :

కొంద‌రికీ ప్ర‌తిరోజు మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంటుంది. మ‌ద్యం త‌క్కువ‌గా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది. మ‌ద్యం తాగిన త‌రువాత వేడి నీరు లేదా మ‌రే ఇత‌ర హాట్ డ్రింక్స్ అస్స‌లు తీసుకోవ‌ద్దు. ఇలా తీసుకోవ‌డం ద్వారా శ‌రీరానికి స్లో పాయిజ‌న్ మాదిరిగా ప‌ని చేస్తుంది. ఆల్క‌హాల్ తీసుకున్న త‌రువాత వేడి నీరు లేదా ఇత‌ర హాట్ డ్రింక్స్ తీసుకున్నా వాంతులుఅయ్యే అవ‌కాశం ఉంది.

Also Read : 

వ‌ర్షాకాలంలో సంభ‌వించే వ్యాధుల‌కు చెక్ పెట్టేందుకు ఈ ఐదు పండ్లు తినాల్సిందే..!

Visitors Are Also Reading