ఈ ఏడాది శ్రావణ మాసం రేపటి నుంచే ప్రారంభం అవుతుంది. అనగా జులై 29 నుంచే ప్రారంభమై ఆగస్టు 27 వరకు ఉంటుంది. ఇక శ్రావణ మాసం స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైంది. ఈమాసంలో స్త్రీలు ఉపవాసాలు ఉంటూ నోములు, వ్రతాలు, పూజలు ఇంట్లో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది శ్రావణంలో ఐదు సోమవారాలు వచ్చాయి. జులై, ఆగస్టు నెల్లో ఎక్కువగా శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కలుస్తాడు. ఈ నెలను శ్రావణమాసం అంటారు. అదేవిధంగా ఈ నెలలో వర్షాలు బాగా పడతాయి. వ్యవసాయ పనులు జరుగుతాయి. అందుకే ఈ శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ప్రధానంగా శ్రావణమాసంలో కొత్తగా పెళ్లి జరిగిన జంటలకు ఆషాడ మాసం ఇచ్చే దూరాన్ని శ్రావణమాసం దగ్గరికి చేస్తుంది.
Advertisement
శ్రీమహావిష్ణువు జన్మది నక్షత్రం అందుకే ఈ మాసంలో నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజిస్తే పుణ్యం వస్తుందట. శ్రావణ మాసంలో శివునికి సోమవారం ఉపవాసం ఉండి రాత్రి ఈశ్వరునికి రుద్రాభిషేకం, జలార్చన చేస్తే పాపాలు పోతాయని కొందరి నమ్మకం. మహిళలు పాటించే వ్రతాలు రకాల అన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే జరుపుకుంటారు. అందుకే దీనిని వ్రతాల మాసం అని పిలుస్తారు. శ్రావణమాసంలో ఒక్కొ రోజుకు ఒక్కో విశిష్టత ఉందని పురోహితులు పేర్కొంటున్నారు. ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కుగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మంగళ, శుక్రవారాలు ఏదైనా పూజించడానికి ముఖ్యమైన రోజులు. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ సోమవారం, మంగళగౌరీ వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమవాస్య తదితర పండుగలు ఈ మాసంలోనే రావడం విశేషం.
Advertisement
శ్రావణ మాసంలో మాత్రం ఈ పనులను మాత్రం అస్సలు చేయకూడదనే చెప్పాలి. ఈ పనులను చేస్తే దరిద్రం పట్టుకుంటుందట. శ్రావణ మాసంలో జుట్టును కట్ చేయకూడదు. షేవింగ్ కూడా చేసుకోకూడదు. అదేవిధంగా గోర్లను కూడా కత్తిరించకూడదట. ఇక శరీరంపై నూనెతో మసాజ్ చేయడం వంటి పనులను అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయడం ద్వారా గ్రహ దోషాలు సంభవించే అవకాశం ఉంది. శ్రావణమాసంలో తొలి సోమవారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు. తొలి సోమవారం రోజు విలాసాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. శ్రావణ మాసంలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలను అస్సలు రానీయకూడదు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఈ మాసంలో ఇల్లు పరిశుభ్రంగా ఉండకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగదు.
Also Read :
కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎలా బయటపడాలంటే..?