తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ చేసిన వాక్యాలు మరోసారి మరోసారి వివాదంగా మారాయి. దీంతో బీజేపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని రోజుల క్రితం ఉదయనిది చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అది మరవక ముందే మరోసారి హిందూవాదుల ఆగ్రహానికి గురవుతున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ హిందూవాదులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం సరికాదంటూ తమిళనాడు మంత్రి ఉదయనిది స్టాలిన్ మండిపడ్డారు.
ఇది ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందని మండిపడ్డారు. ఈ వివాదాస్పద వాక్యాలపై కూడా బీజేపీ నేతలు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉదయనిది స్టాలిన్ అహ్మదాబాద్ స్టేడియంలో ఘటనపై ట్వీట్ చేశారు. క్రీడా స్ఫూర్తికి, ఆతిథ్యానికి భారత్ పెట్టింది పేరు అని… అయితే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్ ప్లేయర్ల పట్ల ప్రేక్షకులు దిగజారి ప్రవర్తించారని వివరించారు. ఇది ఆమోదయోగ్యం కాదని, సోదరభావాన్ని పెంచే దేశాలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని అన్నారు. దీన్ని దేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగించడం సరికాదని ట్వీట్ చేశారు. ఆయన ప్రపంచకప్ లో భాగంగా అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న సమయంలో ప్రేక్షకులు ‘జై శ్రీరామ్….జై శ్రీరామ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఉదయనిది స్టాలిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఉదయనిది చేసిన ఈ వాక్యాలపై బిజెపి తమిళనాడు చీఫ్ అన్నామలై మండిపడ్డాడు. క్రీడలను ఆటగానే చూడాలంటూ ఉదయనిది స్టాలిన్ సందేహాలు ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ విషయంలో మంత్రి స్టాలిన్ కు సంబంధం ఏమిలేదని… సనాతన ధర్మాన్ని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. పాక్ క్రికెటర్లు స్టేడియంలో ప్రార్థనలు చేసిన ఘటనలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇక మరో నేత బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ ఉదయనిది సనాతన ధర్మంపై విషం చిమ్మెందుకు మరో దోమ వచ్చిందంటూ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
- నిహారికకు లావణ్య టార్చర్…ఇంట్లో కూడా ఉండద్దు అంటూ ?
- ఒంగోలులో రహస్యంగా జ్యోతిష్యుడుని కలిసిన విజయమ్మ… మతం మార్చుతున్నారా ?
- సాయి ధరమ్ తేజకు షాక్…విరూపాక్ష సీక్వెల్ లో అఖిల్…!