Home » అక్కినేని సుమంత్ కీర్తిరెడ్డి కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా…?

అక్కినేని సుమంత్ కీర్తిరెడ్డి కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా…?

by Sravanthi
Ad

అక్కినేని కుటుంబానికి సంబంధించిన హీరోగా ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు పొందిన నటుడు సుమంత్. నాగేశ్వరరావు బిడ్డ కొడుకు అయిన ఆయన ఇండస్ట్రీలో చేసిన మొదటి సినిమా ప్రేమ కథ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినా కానీ నటుడుగా సుమంత్ కి మంచి గుర్తింపు వచ్చింది.దీనికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. సుమంత్ ఆ చిత్రం తర్వాత చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక స్టేజిలో సుమంత్ కెరియర్ డైలామా లో పడిపోయినది. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో వరుస సినిమాలు చేస్తూ వచ్చారు..

also read:కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చైతూ…ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Advertisement

Advertisement

ఇందులో భాగంగానే సుబ్రహ్మణ్యపురం,మళ్లీ రావా అనే సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత చేసిన చిత్రాలు ఫ్లాప్ అవడంతో హీరోగా నిలబడలేకపోయారు. ఇక సినిమాల పరంగానే కాకుండా ఆయన నిజ జీవితంలో కూడా సక్సెస్ అందుకోలేదని చెప్పవచ్చు. తొలిప్రేమ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి రెడ్డిని సుమంత్ వివాహం చేసుకున్నారు. వీళ్ళ వైవాహిక జీవితం చాలా కాలం పాటు హ్యాపీగానే కొనసాగింది.

also read:ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్ ఒక్కడే ఉంటున్నారు. ఆయన మళ్లీ ఇంకో వివాహం చేసుకోలేదు. ప్రస్తుతం సుమంత్ వారాహి అనే సినిమా చేస్తున్నాడు.ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమాలో కీలక పాత్ర పోషించారు సుమంత్. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మంచి పేరు వచ్చింది.

also read:కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

Visitors Are Also Reading