Home » కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చైతూ…ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చైతూ…ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య కొత్తింట్లో అడుగుపెట్టాడు. నాగ‌చైత‌న్య త‌న భార్య, హీరోయిన్ సమంత‌తో విడాకులు తీసుకున్న త‌ర‌వాత ఒంటరిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌మంత‌తో క‌లిసి ఉన్న స‌మ‌యంలో చైతూ హైద‌రాబాద్ లోని ఓ ఫ్లాట్ లో అద్దెకు ఉండేవాడు. ఇక విడాకులు తీసుకున్న త‌ర‌వాత హోట‌ల్ కు షిప్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు నాగ‌చైత‌న్య కొత్తఇంటిని నిర్మించుకున్నాడు.

ALSO READ :వేసవిలో రోజంతా ఉత్సాహంగా ఈ జ్యూస్ తప్పక తీసుకోండి..!

Advertisement

Nagachaitanya

Nagachaitanya

ఆ ఇంటిని నాగార్జున ఇంటికి ద‌గ్గ‌ర‌లో నిర్మించుకున్నాడు. కొత్తఇంటిని నాగ‌చైత‌న్య విలాస‌వంతంగా నిర్మించుకున్నాడు. ఆ ఇంట్లోనే జిమ్, స్విమ్మింగ్ ఫూల్ మ‌రియు ఇత‌ర వ‌స‌తులు ఉండేలా నిర్మించుకున్నాడు. ఇక ఉగాది పండ‌గ సంధ‌ర్బంగా నాగ‌చైత‌న్య కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు చందు మొండేటి వెల్లడించారు.

Advertisement

నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ప్రేమ‌మ్ సినిమాకు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా నుండి ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాగా చందూ మొండేటి త‌న సోష‌ల్ మీడియా పోస్ట్ లో….ఉగాది రోజున యువ‌సామ్రాట్ కొత్త ఇల్లు. నేనే మొద‌టి అతిధి…కంగ్రాట్యులేష‌న్స్ అండ్ థాంక్యూ. అంటూ పేర్కొన్నారు.

Samnatha nagachaitanya

Samnatha nagachaitanya

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం చైతూ వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా కొత్త ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్నాడు. మ‌రోవైపు నాగ‌చైత‌న్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త‌లు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఓ హీరోయిన్ తో చైతూ ప్రేమ‌లో ఉన్నాడ‌ని ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ALSO READ : Balagam : ‘బలగం’ మూవీ ఓటేటి రిలీజ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Visitors Are Also Reading