దేశంలో ఈరోజుల్లో పెళ్లి కాని ప్రసాద్‌లు పెరిగిపోతున్నారు. మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేస్తుండడంతో పాటు మగవారితో సమానంగా సంపాదిస్తున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం రావడంతో మహిళలు తమకు నచ్చిన వ్యక్తులను ఎంచుకుని వివాహాలు చేసుకుంటున్నది. దీంతో దేశంలో పెళ్లి కాకుండా మిగిలిపోతున్న పురుషుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఒక పెళ్లి కోసమే చాలా మంది ఎదురుచూస్తుంటే ఒడిశాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అందరూ కలిసి ఉంటారా అంటే లేదు. ఒకరికీ తెలియకుండా మరొకరినీ వివాహం చేసుకున్నాడు. చివరకు బండారం బయటపడడంతో కటకటాలపాల్పయ్యాడు.
Also Read : పుష్ప విలన్ డాలీ ఎవరు.?..ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి ..!
Advertisement
Advertisement
ఒడిషాలోని కేంద్ర పర జిల్లాకు చెందిన బిధు ప్రకాశ్ స్వైన్ అనే వ్యక్తి డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాల్లోని మహిళలకు వివాహం చేసుకున్నాడు. పంజాబ్, ఢిల్లీ, జార్ఝండ్, అస్సాం, ఒడిషా రాష్ట్రాలకు చెందిన మహిళలను డాక్టర్ పేరుతో నమ్మించి మ్యాట్రిమోనియల్ ద్వారా వివాహం చేసుకున్నాడు. డ్రైవర్స్ తీసుకున్న ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారిని వలలో వేసుకుని వివాహం చేసుకుంటారు.
కొన్ని రోజులు కాపురం చేసిన తరువాత భువనేశ్వర్ లో పని ఉందని చెప్పివదిలేసి వెళ్లాడట. అనుమానం వచ్చిన మహిళ పోలీసులను సంప్రదించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల బిధు ప్రకాశ్ స్వైన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. షాక్ ఇచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను 13 మంది మహిళలను వివాహం చేసుకున్నట్టు బిధు ప్రకాశ్ వివాహం చేసుకున్న మహిళల వివరాలను పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు.
Also Read : 500 ఏళ్ల నాటి కదిరి విషాద ప్రేమ కథ గురించి మీకు తెలుసా..?