Home » దొంగ అని తెలిసి కూడా ఇంటికి పిలిచి మరీ మర్యాద చేసిన శ్రీహరి.. చాలా గ్రేట్ అంటూ..?

దొంగ అని తెలిసి కూడా ఇంటికి పిలిచి మరీ మర్యాద చేసిన శ్రీహరి.. చాలా గ్రేట్ అంటూ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో అనే పదానికి నిలువెత్తు రూపం శ్రీహరి అని చెప్పవచ్చు.. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం కలిగిన శ్రీహరి మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకే పెద్దవాళ్లు ఓ సామెత అంటారు.. మంచి వాళ్లకు తొందరగా చావు వస్తుందని, అంతటి గొప్ప మనిషి శ్రీహరి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. కానీ చిన్న వయసులోనే మరణించారు..

Advertisement

అలాంటి శ్రీహరి గురించి ఆయన భార్య డిస్కో శాంతి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది అవేంటో చూద్దాం.. శ్రీహరికి కోపం ఎక్కువగా ఉంటుందని చాలామంది అనుకునేవారని, కానీ అసలు శ్రీహరికి కోపం రాదని తెలిపింది. ఆయనకున్న మంచి గుణం ఏంటంటే ఎవరినైనా ఇట్టే నమ్ముతారు అని అన్నది. ఎవరు వచ్చి ఏది చెప్పినా నమ్ముతారని, ఆ ఫలానా వ్యక్తి దొంగ అని తెలిసినా ఆయనకు మర్యాద చేస్తారని డిస్కో శాంతి తెలియజేసింది. శ్రీహరికి తన ఇద్దరు కొడుకులలో చిన్న కొడుకు అంటే చాలా ఇష్టమని అన్నది.

Advertisement

ఆయన ను నేను బావ అని పిలిచేదాన్ని, ఆయన కూడా నన్ను బావ అనే వారిని చెప్పుకొచ్చింది. హీరో అయ్యే వరకు శ్రీ హరి చిత్రాలను నేను చూడలేదని డిస్కో శాంతి పేర్కొంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన హీరో శ్రీహరి అని చెప్పుకొచ్చింది. ఆయన మరణించిన కానీ ఇప్పటికీ ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలియజేసింది.

also read:

Visitors Are Also Reading