Home » బాలయ్య కోసం ఆ క్రేజీ డైరెక్టర్ రెండు రోజులు జైల్లో ఉన్నాడట…ఎందుకంటే..?

బాలయ్య కోసం ఆ క్రేజీ డైరెక్టర్ రెండు రోజులు జైల్లో ఉన్నాడట…ఎందుకంటే..?

by AJAY
Ad

చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య అంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోనూ బాలయ్యకు కొంత మంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల్లో దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాను బాలయ్య డై హార్డ్ ఫ్యాన్ అంటూ గోపీచంద్ మలినేని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

Balakrishna

Balakrishna

బాలయ్య అంటే ఒక వైబ్రేషన్.. బాలయ్య అంటే ఒక ఎమోషన్… అంటే ఒక విస్పోటనం అంటూ గోపీచంద్ పొగడ్తలు కురిపించారు. అంతేకాకుండా బాలయ్య హీరోగా నటించిన “సమరసింహా రెడ్డి” సినిమా టికెట్ల కోసం రెండు మూడు రోజులు తాను ఒంగోలు జైల్లో ఉన్నారని గోపిచంద్ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా తాను కూడా డిసెంబర్ 2 (అఖండ సినిమా విడుదల) కోసం వెయిట్ చేస్తున్నా అని గోపీచంద్ మలినేని సినిమా విడుదలకు ముందు ట్వీట్ చేశారు.

Advertisement

Advertisement

బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవాల్సిందే అంటూ కామెంట్ చేశారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా ఎఫ్ -3 సినిమాను తెరకెక్కిస్తన్నారు. ఈ సినిమా తర్వాత తన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది అంటూ ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Visitors Are Also Reading