భారతదేశంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకునిగా విఠలాచార్య 1967 ఆ సమయంలో రికార్డుల్లోకి ఎక్కారు. ఇక ఆయన దర్శకుడిగా కావాలని ఏ రోజు కూడా అనుకోలేదట. అన్ని అవసరం కోసమే చేశారట. 1943లో అందరి యువకుల మాదిరిగానే స్వాతంత్య్రం కోసం కొట్లాడి మూడు సార్లు జైలుకు వెళ్లారు. ఉడిపిలో పుట్టిన విఠలాచార్య సినిమాలో కళ కంటే వ్యాపారమే ఎక్కువ ఉందని నమ్మిన వ్యక్తుల్లో ఒకరు. తొలుత ఏదైనా వ్యాపారం చేయాలన భావించాడు. కర్ణాటకలోకి వచ్చిన తరువాత ఆయనకు సినిమా పిచ్చి తోడు అయింది.
Also Read: పోకిరి సినిమాను రీ రిలీజ్ చేసి నిర్మాతలు ఎంత లాభం పొందారో తెలుసా..?
Advertisement
ఆ సినిమా పిచ్చి తొలుత టూరింగ్ టాకీస్ బిజినెస్ చేశారు. ఇక ఆ తరువాత కొంత మంది స్నేహితులను కలుపుకొని కన్నడ సినిమాలను విడుదల చేయడం ప్రారంభించారు. ఈ తరుణంలోనే జానపద చిత్రాలు ఆయనను ఆకర్షించాయి. ఒక దర్శకునితో ఆయన సినిమా తీస్తుండగా.. అతడు హ్యాండ్ ఇవ్వడంతో విఠలాచార్య దర్శకునిగా మారారు. ఆయన సినిమాల్లో ఎలాంటి జిమ్మిక్కులు, గ్రాఫిక్స్ ఉండవు. అయినప్పటికీ కూడా దయ్యాల సినిమాలను చేయడానికి ఆయనకు ఎవ్వరూ సాటి లేరు. అలా ఏకంగా 55 సినిమాలకు దర్శకత్వం వహించి జానపద బ్రహ్మగా పేరు సంపాదిచుకున్నారు. ఆయనతో ఓ సందర్భంలో మాత్రం ఎన్టీఆర్ సినిమా చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. ఎందుకు ఒప్పుకోలేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Also Read: వామ్మో రష్మిక మరీ అంతలా పెంచిందేంటి..అదేంటో మీరు కూడా చూడండి..!!
వాస్తవానికి విఠలాచార్య హీరోల తేదీలను చాలా తక్కువనే తీసుకుంటాడట. ఎందుకంటే ఆయన ఒక బడ్జెట్ మనిషి కాబట్టి హీరో తేదీలు తక్కువ తీసుకుని సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఈ తరుణంలోనే నందమూరి తారకరామారావు తో ఒక సినిమా తీయాలని అడగ్గా కేవలం వారం మాత్రమే డేట్స్ ఉన్నాయని చెప్పాడట. దీంతో వెంటనే ఆ వారం రోజులు నాకు చాలు. అవి నాకు ఇచ్చేయండి సినిమా తీస్తానని చెప్పగానే ఎన్టీఆర్ భయపడ్డారట. వారంలో సినిమా ఎలా పూర్తవుతుది. కొంత షూటింగ్ చేశాక హీరోకి శాపం పెట్టేసి సినిమాలో కనిపించక ముందే పూర్తి చేస్తాడేమోనని భయం వేసి ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట. అలా ఎన్టీఆర్ విఠచార్యతో సినిమాలు చేయలేదు.
Also Read :
వామ్మో రష్మిక మరీ అంతలా పెంచిందేంటి..అదేంటో మీరు కూడా చూడండి..!!