Home » త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడంటున్న నటి ప్రేమ.. కారణం..!!

త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశాడంటున్న నటి ప్రేమ.. కారణం..!!

by Sravanthi
Ad

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది నటి ప్రేమ. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. భక్తికి సంబంధించిన సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే అప్పట్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు హీరోయిన్ ప్రేమదే. గ్లామర్ పాత్రలతో పాటు దేవతపాత్రలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలాంటి హీరోయిన్ ప్రేమ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది..

Advertisement

తను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైంలోనే సహాయ నటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలియజేసింది. త్రివిక్రమ్ ను నమ్మి నేను మోసపోయానంటూ సంచలమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ప్రేమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంత త్వరగా పేరు సంపాదించుకుందో అంతే త్వరగా ఫెడ్ అవుట్ జాబితాలోకి వెళ్ళింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తోంది. చాలా కాలం తర్వాత బుల్లితెరపై పాల్గొన్నటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. తను హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో “చిరునవ్వుతో” సినిమాలో సహాయనటిగా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియజేసింది. త్రివిక్రమ్ కథనం అందిస్తున్న చిరునవ్వుతో మూవీ సినిమాలో అవకాశం వచ్చిందట. ఈ చిత్రంలో బావతో పెళ్లి వద్దనుకొని ఓ మోసగాడిని పెళ్లి చేసుకుని మోసపోయిన అమ్మాయి పాత్ర. ఈ పాత్రను చేయడానికి ప్రేమ ముందుగా సంకోచించిందట. నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను.

Advertisement

also read:నెట్టింట వైర‌ల్ అవ‌తున్న యాంక‌ర్ సుమ అస‌లు వ‌య‌సు..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

త్రివిక్రమ్ ముందు ఈ సినిమాలో నాది హీరోయిన్ పాత్ర అని చెప్పారు. కానీ ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉందా.. అని అడిగాను.. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్ర అని త్రివిక్రమ్ నన్ను ఒప్పించేశాడు. కథ కూడా నా చుట్టూ తిరుగుతుందని చెప్పడంతో ఆయన మీద నమ్మకంతో ఒప్పేసుకున్నాను. తీరా సినిమా విడుదలయ్యాక నాదంతా సహాయ నటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ సమయంలో ఒకలా చెప్పి సినిమాలో నన్ను ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ మోసం చేశాడు. ఈ చిత్రం తర్వాత నాకు అన్నీ అలాంటి పాత్రలే వచ్చాయి. ఆయన వలన నా కెరియర్ పోయింది అని తెలిపారు ప్రేమ.

also read:

Visitors Are Also Reading