Home » హీరోయిన్ గా సినిమాల్లో రావడానికి శంకర్ తన కూతురు అదితికి అలాంటి కండిషన్ పెట్టారా..?

హీరోయిన్ గా సినిమాల్లో రావడానికి శంకర్ తన కూతురు అదితికి అలాంటి కండిషన్ పెట్టారా..?

by Mounika
Ad

తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ఏ రేంజ్ లో  సూపర్ హిట్ సక్సెస్ ని అందుకుంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఈ స్టార్ డైరెక్టర్ శంకర్ తన కూతురు అదితి శంకర్ ని హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశారు. శంకర్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన అదితి రెండు సినిమాల్లోనే నటించినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కార్తీ నటించిన విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అదితి శంకర్ తన మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ సక్సెస్ ని అందుకుంది.

Advertisement

ఈ క్రమంలో అదితి శంకర్ మరో మూడు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అదితి నటించిన రెండు చిత్రాలు హిట్టు కావడంతో ఆమెపై ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటంటే నిజానికి తన కూతురు అదితి  హీరోయిన్‌గా రావడం శంకర్‌కి ఇష్టం లేకపోయినా, కొన్ని షరతులతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నారట .

Advertisement

ఎంబీబీఎస్‌ చదివిన అదితి శంకర్‌ డాక్టర్‌ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల కోరిక అని తెలుస్తోంది. చాలా చలాకీగా ఉండే అదితి శంకర్‌కు సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి మరీ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. అదితి శంకర్‌ హీరోయిన్ గా నటించడానికి అంగీకరించిన ఆమె తండ్రి శంకర్‌ ఓ కండిషన్‌ పెట్టారట. రెండేళ్ల వరకూ నువ్వు ఎన్ని సినిమాల్లోనైనా నటించు.. ఆ తరువాత మా ఇష్ట ప్రకారం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కూతురికి కండిషన్ పెట్టారట శంకర్.

అందుకనే ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని అదితి తాపత్రయ పడుతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు సైతం డైరెక్టర్‌ శంకర్‌ ఇలాంటి కండీషన్‌ పెట్టాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. బహుశా ఇది వుట్టి పుకారు మాత్రమే అయి ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అతిధి ప్రతిభను చూశాకైనా శంకర్‌ ఈ కండీషన్‌ ఉపసంహరించుకుని ఉండవచ్చని కామెంట్ చేస్తున్నారు.

మరీకొన్ని ముఖ్యమైన వార్తలు :

Pawan kalyan: “అదే ఆఖరి సినిమా.. ఇంకా చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యా..” వారాహి యాత్రలో పవన్ వైరల్ కామెంట్స్!

అసలు మీరు ఎవర్రా ఆయనను తిట్టడానికి.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ ఉపాసన స్ట్రాంగ్ వార్నింగ్..!

ఊరి పేరునే సినిమా టైటిల్స్ గా పెడుతున్న మేకర్స్…!

 

Visitors Are Also Reading