Home » అసలు మీరు ఎవర్రా ఆయనను తిట్టడానికి.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ ఉపాసన స్ట్రాంగ్ వార్నింగ్..!

అసలు మీరు ఎవర్రా ఆయనను తిట్టడానికి.. నోరు అదుపులో పెట్టుకోండి అంటూ ఉపాసన స్ట్రాంగ్ వార్నింగ్..!

by Mounika
Ad

పకోడి గాళ్లు సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అని మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై తాజాగా ఉపాసన వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో మరింత సెన్సేషనల్ ఇష్యూ గా మారింది.  వాల్తేరు వీరయ్య సినిమా 200వ రోజులా వేడుకలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై చిరంజీవి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆ కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారంగా మారాయి. చిరంజీవిపై అధికార వైసీపీ పార్టీ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేశాయి.

Advertisement

 చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ప్రతిదాడిగా వైసీపీ నేతలు వెంటనే ఎదురు దాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై  సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లు ఉన్నారు అంటూ పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కొందరు పకోడీ గాళ్లు  ప్రభుత్వం ఎలా ఉండాలో వాళ్లు మాకు సలహా ఇస్తున్నారు. ఈ పకోడీ గాళ్లు ఉచిత సలహాలు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. మనకి రాజకీయాలు ఎందుకు..? మనం డ్యాన్స్, ఫైట్, యాక్షన్ చూసుకుందాం అని చెప్పుకోవచ్చు కదా అంటూ చిరంజీవిని, పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు నాని. కొడాలి నానికి తోడు పేర్ని నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చిరంజీవి ఫ్యాన్ నే అని, ఒకప్పుడు దండలు కూడా వేశామని గుర్తు చేశారు పేర్ని నాని. 

Advertisement

 తాజాగా చిరంజీవిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఉపాసన కూడా స్పందించారు. అంతేకాకుండా వారికీ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. చిరంజీవి గారిని ఏమైనా అనే హక్కు ఆయన అభిమానులకు, ఫ్యామిలీకి మాత్రమే ఉంది. ఉపాసనా చిరంజీవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశిస్తూ  ఆయన సైలెంట్ గా ఉంటేనే  ఇన్ని వేల మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారు. ఆయన కనుక గట్టిగా మాట్లాడితే ఏమౌతుందో వాళ్లకు తెలియదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని  ఇండైరెక్టుగా నేతలకు వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అంటూ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడిన వారిని హెచ్చరించారు ఉపాసన.

Visitors Are Also Reading