Home » పాకిస్థాన్ లో కోట్లు సంపాదిస్తున్న హిందూ మ‌హిళ‌..ఆమె ఎవ‌రు ఏం చేస్తుందో తెలుసా..?

పాకిస్థాన్ లో కోట్లు సంపాదిస్తున్న హిందూ మ‌హిళ‌..ఆమె ఎవ‌రు ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY

పాకిస్థాన్ ముస్లీం కంట్రీ అక్క‌డ హిందూ జ‌నాభా చాలా త‌క్కువ‌. కానీ ఆ త‌క్కువ జ‌నాభాలోనూ ఇండియా నుండి వెళ్లిన ఓ హిందూ మ‌హిళ కోట్లు సంపాదిస్తోంది. ఆమె సంపాద‌న తెలిస్తే మైండ్ బ్లాక్ ఎవ్వ‌రైనా షాక్ అవ్వాల్సిందే. మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చి విభ‌జ‌న జ‌రిగిన త‌ర‌వాత కొంత‌మంది భార‌తీయులు కూడా పాకిస్థాన్ లో స్థిర‌ప‌డ్డారు. అలా స్థిర‌ప‌డిన‌వారిలో సంగీత అనే మ‌హిళ కూడా ఉన్నారు.

పాకిస్థాన్ లో ప్ర‌స్తుతం ఆర్థిక సంక్షోభం మొద‌ల‌య్యింది దాంతో అక్క‌డ రిచ్ పీపుల్ ఎవ‌రా అన్న స‌ర్వే మొద‌ల‌య్యింది. కాగా హిందువుల్లో ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ దీప‌క్ పెర్వాని ఉన్నారు. కాగా హిందూ మ‌హిళ‌ల్లో సంప‌న్నురాలుగా సంగీత రికార్డు క్రియేట్ చేశారు. సంగీత కూడా సినిమా రంగానికి చెందిన‌వారే.

అయితే సంగీత హిందూ మ‌హిళ‌న అయిన‌ప్ప‌టికీ ఆమెను అక్క‌డ ప‌ర్వీన్ రిజ్వీ అని పిలుస్తారు. సంగీత పాకిస్థాన్ లో హిందూ మ‌హిళ‌గానే ఉన్నప్ప‌టికీ అక్క‌డ మ‌తానికి వ్య‌తిరేకంగా ఆమె పేరు ఉండ‌టంతో ప‌ర్వీన్ రిజ్వీగా మార్చుకున్నారు. సంగీత సినిమా న‌టిగా ద‌ర్శ‌కురాలిగా ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. 21 ఏళ్ల వ‌య‌సులోనే సినిమా రంగంలో ఆమె ఫుల్ బిజీ అయ్యారు. ఇక సంగీత మరెవరో కాదు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జియాఖాన్ కు అత్త అవుతుంది. ఇదిలా ఉంటే సంగీత ఒక్క నెల‌కే కోట్ల రూపాయ‌లు సంపాదిస్తుంది. సంగీత ఒక్క యేడాదికి రూ.39 కోట్లు సంపాదిస్తున్న‌ట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ లో హిందూ మ‌హిళ ఈ రేంజ్ లో సంపాదించ‌డం అంటే నిజంగా గ్రేట్ క‌దా.

Visitors Are Also Reading