ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో అటు ప్రభుత్వానికి, ఇటు సినిమా పరిశ్రమకు మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా, టీవీ ఇంటర్వ్యూల ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసినదే. రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆర్జీవీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగానే.. తాజాగా ఆర్జీవీ పేర్నినానిని అభ్యర్థిస్తూ మరొక ట్వీట్ చేసారు.
Advertisement
Advertisement
పేర్ని నాని గారు ప్రభుత్వంతో గొడవ పడాలనేది మా ఉద్దేశం కాదు. మా సమస్యల గురించి మేము సరిగ్గా చెప్పుకోలేకపోవడం వల్లనో.. మీరు మా కోణం నుండి అర్థం చేసుకోకపోవడం వల్లనో ఈ మిస్ అండర్‌స్టాండ్ జరిగినది. నా రిక్వెస్ట్ ఏమిటంటే.. మీరు అనుమతి ఇస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరుపున సమస్యలను వివరిస్తాను. అది విన్న తరువాత ప్రభుత్వం పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
అయితే ఆర్జీవీ ట్వీట్‌కు పేర్నినాని స్పందించారు. ధన్యవాదాలు రామ్‌గోపాల్ వర్మ. తప్పకుండా త్వరలో కలుద్దాం అని రిప్లై ఇచ్చారు. ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి నుంచి సానుకూలమైన స్పందన రావడంతో.. ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆర్జీవీ మరొక ట్వీట్ చేశారు.