రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా సంచలనం సృష్టించిన మూవీ మగధీర. ఈ సినిమా పేరు వినగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది కాలభైరవ. ఈ చిత్రంలో హర్షలో చరణ్ మొదటి పార్ట్ లో నటించాడు.
Advertisement
కానీ జనాలందరికీ కాలభైరవ రోలే నచ్చింది. 2009 జూలై 31న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేశారు. రాజమౌళి కెరీర్ లో మగధీర ప్రత్యేకమైన సినిమా అనే సంగతి తెలిసిందే.
READ ALSO : సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?
అయితే మగధీర సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయిన సమయంలో గుర్రం సాయం చేస్తుందనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక సందర్భంలో ఈ సీన్ గురించి జక్కన్న మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, కొదమ సింహం మూవీలో రౌడీలు చిరంజీవిని ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోగా గుర్రం, చిరంజీవి నోటికి తాడును అందించి చిరంజీవి ప్రాణాలను కాపాడుతుందని,
Advertisement
READ ALSO : IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే
అయితే ఆ ప్రాణాలను కాపాడిన చిరంజీవికి, గుర్రానికి మధ్య అనుబంధం లేకపోవడంతో తాను నిరుత్సాహపడ్డానని జక్కన్న తెలిపారు. ఇసుక ఊబి నుంచి బయటకు వచ్చిన చరణ్ గుర్రాన్ని కౌగిలించుకుంటాడని ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొందిన సన్నివేశాలను తాను తెరకెక్కించానని రాజమౌళి పేర్కొన్నారు. చిరంజీవి అలా చేయలేకపోయినా చరణ్ తో ఆ సీన్లను చేయించానని రాజమౌళి చెప్పగానే చెప్పేశారు.
READ ALSO : Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?