Home » సినిమా క‌థ‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని ర‌మా రాజ‌మౌళిల ప్రేమ‌క‌థ‌…ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారంటే..!

సినిమా క‌థ‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని ర‌మా రాజ‌మౌళిల ప్రేమ‌క‌థ‌…ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారంటే..!

by AJAY
Published: Last Updated on
Ad

దేశంలోని టాప్ డైరెక్ట‌ర్ ల‌లో ఒక‌రు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఈగ‌, బాహుబ‌లి, మ‌గ‌ధీర లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లతో రాజ‌మౌళి దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌న సినిమాను పొగిడారంటే అందులో జ‌క్క‌న్న చెక్కిన బాహుబ‌లితో వ‌చ్చిన గుర్తింపు ఎంతో ఉంది. ఇదిలా ఉంటే రాజ‌మౌళి సినిమాల్లో భారీ సెట్టింగ్ లు, గ్రాఫిక్స్ లు, యుద్ద స‌న్నివేశాల‌తో పాటూ అంద‌మైన ప్రేమ క‌థ కూడా ఉంటుంది.

Advertisement

అయితే జ‌క్క‌న్న నిజ‌జీవితంలోనూ సినిమాల‌కు మించిన ప్రేమ‌క‌థ ఉంది. రాజ‌మౌళి ర‌మను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కుమారుడు కార్తికేయ‌తో పాటూ మ‌రోకూతురు కూడా ఉన్నారు. రాజ‌మౌళికి ర‌మ‌తో పెళ్లికి ముందే పరిచ‌యం ఉంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి భార్య అయిన శ్రీవ‌ల్లికి ర‌మ సొంత చెల్లి కావ‌డం విశేషం. అలా రాజ‌మౌళికి ర‌మ ప‌రిచ‌యం అయ్యారు.

Also Read: నాటో ప్ర‌య‌త్నాలు విర‌మిస్తాం.. ర‌ష్యాతో ఒప్పందానికి సిద్ధం : జెలెన్ స్కీ

Advertisement

అయితే ర‌మకు అప్ప‌టికే వివాహం కూడా అయిపోయింది. కార‌ణం తెలియ‌దు కానీ త‌న భర్త‌తో ర‌మ 2000 సంవ‌త్స‌రంలో విడాకులు తీసుకుంది. అయితే అప్ప‌టికే ర‌మ‌కు కుమారుడు కార్తికేయ ఉండ‌గా కోర్టులో కార్తికేయ‌పై స‌ర్వ‌హక్కులు ర‌మ‌కే ద‌క్కాయి. అయితే భ‌ర్త‌తో విడిపోయిన త‌ర‌వాత రాజ‌మౌళి త‌న ప్రేమ‌ను తెలిపి ర‌మ‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో కూతురును కూడా ద‌త్త‌త తీసుకున్నారు.

అంతే కాకుండా కార్తికేయ‌తో త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌ని అత‌డితో ఎలాంటి స‌మ‌స్య‌లేద‌ని రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. ఇదిలా ఉండ‌గా సింహాద్రి సినిమా షూటింగ్ స‌మ‌యంలో రాజ‌మౌళి కాస్ట్యూమ్ డిజైన‌ర్ ప‌ని విష‌యంలో నిరాష చెందారు. అయితే అదే స‌మ‌యంలో ర‌మ ముందుకు వ‌చ్చి కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయ‌గా ఆ కాస్ట్యూమ్స్ జ‌క్క‌న్న‌కు తెగ‌న‌చ్చాయి. ఇక అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ర‌మ త‌న భ‌ర్త రాజ‌మౌళి సినిమాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Also Read: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు దూరంగా విజయేంద్ర ప్రసాద్….కారణం అదేనా….!

Visitors Are Also Reading