Home » ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు దూరంగా విజయేంద్ర ప్రసాద్….కారణం అదేనా….!

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు దూరంగా విజయేంద్ర ప్రసాద్….కారణం అదేనా….!

by AJAY
Ad

రాజమౌళి ప్రస్తుతం తిరుగులేని దర్శకుడిగా ఇండస్ట్రీ లో ఎదిగారు అంటే అది ఆయన టాలెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఆయన ఎంచుకున్న సినిమా కథలు కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. ఇక ఆ సినిమా కథలను అందించింది కూడా మరెవరో కాదు దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్……దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ సక్సెస్ అవ్వాలేకపోయారు కానీ రచయితగా మాత్రం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగీ బాయ్ జాన్ సినిమా తో బాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అదే విధంగా సల్మాన్ ఖాన్ తన కోసం సీక్వెల్ రెడీ చేయమని కోరే స్థాయికి విజయేంద్ర ప్రసాద్ ఎదిగారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ కి కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు అన్న సంగతి తెలిసిందే.

Advertisement

RRR FIRST RIVEW

అంతే కాకుండా ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాకు కూడా కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. అంతే కాకుండా బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో విజయేంద్ర ప్రసాద్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ఆయన కనిపించడం లేదు.

RRR ACTORS REMUNARATIONS

లాక్ డౌన్ సమయంలో ఇంటర్వ్యూ లు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో మాత్రం మీడియా కు దూరంగా ఉంటున్నాడు. దాని వెనక ఓ కారణం కూడా ఉందట….రాజమౌళి తన తరవాత సినిమాను మహేష్ బాబు తో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను ఇస్తున్నారు. దాంతో కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉండటం వల్లనే విజయేంద్ర ప్రసాద్ ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారట.

Visitors Are Also Reading