టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో రాఘవేంద్రరావు కూడా ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 110 సినిమాల వరకూ దర్శకత్వం వహించారు. ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గంగోత్రి సినిమా తో అల్లు అర్జున్ ను పరిచయం చేయగా ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా రానిస్తున్నాడు. అంతే కాకుండా రాజమౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ కూడా రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసి వచ్చినవాడే.
Advertisement
ఇదిలా ఉంటే రాఘవేంద్రరావు సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాష్ రావు కూడా దర్శకుడిగా నిర్మాతగా సినిమాలు చేశారు. తండ్రి వారసత్వంతోనే రాఘవేంద్రరావు కూడా సినిమాల్లోకి వచ్చారు. అంతే కాకుండా తండ్రిపేరును నిలబెట్టి స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇక రాఘవేంద్రరావు తల్లి విషయానికి వస్తే కోటేశ్వరమ్మ ఆయన తల్లి. ప్రకాష్ రావు కోటేశ్వరమ్మలకు మొత్తం నలుగురు సంతానం ఉన్నారు. వారిలో కృష్ణ మోమన్ రావు పెద్దవారు.
Advertisement
ఆ తరవాత రాఘవేంద్రరావు జన్మించాడు. ఆ తరవాత ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇదిలా ఉంటే రాఘవేంద్రరావు తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన వరలక్ష్మి అనే ప్రచారం ఉంది. అయితే అందులో నిజం లేదు.రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు వరలక్ష్మి హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆ తరవాత ఆయన వరలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు.
వారికి ఓ కుమారుడు జన్మించగా అతడికి కూడా వరలక్ష్మి ప్రకాష్ రావు అనే పేరు పెట్టుకున్నారు. ప్రకాష్ రావు కెమెరా మెన్ గా పనిచేయడం తో పాటూ మోహన్ బాబు నటించిన రౌడీ పెళ్లాం సినిమాకు దర్శకుడిగా పనిచేశాడు. కానీ ఆయన చిన్నవయసులోనే అనారోగ్యకారణాలతో మరణించాడు.