Home » సలార్ రిలీజ్ కు ముందు బిగ్ ట్విస్ట్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

సలార్ రిలీజ్ కు ముందు బిగ్ ట్విస్ట్.. ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే..?

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ..  బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. దురద్రుష్టాశాత్తు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారినప్పటి నుంచి ఒక్క సినిమా కూడా మంచి హిట్ పడటం లేదు. బాహుబలి 2 తరువాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు.

Advertisement

తాజాగా ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న మూవీ సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్ధమవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించే ఒకే ఒక్కమాట.. ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడనే వార్త వినిపిస్తుంది. మోస్ట్ వయొలెంట్ మ్యాన్ సలార్ కొడుకు దేవా.. దేవానే ఇలా ఉంటే.. సలార్ వస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త హైప్ పెంచేశారు. డిసెంబర్ 22న క్లారిటీ వస్తుందనుకుంటే.. రిలీజ్ కి ముందే ఇద్దరూ ఒక్కడే అని రివీల్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

Advertisement

సలార్ సినిమాలో సలార్, దేవా వేర్వేరు కాదు.. ఇద్దరూ ఒక్కడే అంటూ ప్రశాంత్ నీల్ రివీల్ చేసాడు. దీంతో సోషల్ మీడియాలో రిలీజ్ కి ముందే రివీల్ చేశాసావ్ ఏంటి మావా అంటూ సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. లుక్స్ పరంగా ప్రభాస్ రెండు వేరియేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఒకటి ఫ్లాష్ బ్యాక్ అండ్ ఇంకొకటి ప్రజెంట్ రోల్ అయయే అవకాశముంది. తండ్రి, కొడుకులు కూడా ఉంటారా లేక ఒక క్యారెక్టర్ తోనే ప్రభాస్ రెండు పార్ట్స్ లో కనిపిస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఒక్కడైనా.. ఇద్దరు అయినా బాక్సాఫీస్ దగ్గర డిసెంబర్ 22న సెన్షేషనల్ ఓపెనింగ్స్ రాబట్టడం అయితే గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading