సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ లో “నేను ఉన్నాను నేను విన్నాను” అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది…. అదేవిధంగా ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.
Advertisement
నిజానికి ఈ డైలాగ్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో వాడారు. దాంతో సీఎం జగన్ డైలాగ్ ఫేమస్ డైలాగ్ ను సినిమాలో పెట్టారని కొంతమంది విమర్శించారు. సీఎం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ఇలా చేశారు అంటూ విమర్శించారు. అయితే తాజాగా దర్శకుడు పరశురామ్ కు ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ గురించే ప్రశ్న ఎదురైంది. సీఎం జగన్ ఫేమస్ డైలాగ్ ను ఆయనను ఫిదా చేయడానికే పెట్టారా అంటూ ప్రశ్నించారు.
Advertisement
దానికి పరుశురామ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. అలా ఏం లేదని తాను వైయస్సార్ అభిమాని అని పరశురామ్ తెలిపారు. ఆయన ఆశయాలు తనను బాగా అట్రాక్ట్ చేశాయని చెప్పారు. చాలా తక్కువ పదాలతో పెద్ద బావం వచ్చే డైలాగ్ అని అన్నారు. ప్రజలకు ఆ డైలాగుతో వైఎస్ఆర్ భరోసా ఇచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో వాడిన ఆ డైలాగ్ తనకు బాగా కనెక్ట్ అయింది అన్నారు.
అయితే నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ డైలాగ్ ను చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. వీడియోలు కూడా లేవు…. కానీ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన వైఎస్ఆర్ బయోపిక్ “యాత్ర” సినిమాలో ఈ డైలాగ్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత వైఎస్ జగన్ నోట ఈ డైలాగ్ వినిపించింది. దాంతో అబద్ధాలు చెబుతున్నావ్ అంటూ దర్శకుడు పరశురామ్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా జగన్ మెప్పు కోసమే ఇలా చేశారంటూ కూడా విమర్శిస్తున్నారు.
Also Read:
పవన్ సినిమా షూటింగ్ కు ఒక్కరోజు బ్రేక్ పడితే అన్ని లక్షల నష్టమా ..!