Home » ధోని ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతను మైండ్ చదివి తెలుసుకుంటా..!

ధోని ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతను మైండ్ చదివి తెలుసుకుంటా..!

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏం ఆలోచిస్తాడు అనేది ఎవరికీ తెలియదు. ధోని తీసుకునే కొన్ని నిర్ణయాలు అప్పుడు తప్పు అనిపించిన ఆతర్వాత మాత్రం అదే సరైనది అనిపిస్తుంది. కిష్ట పరిస్థితుల్లో అనుభవం లేని వారికీ బౌలింగ్ ఇవ్వడం అనేది ధోనికి అలవాటైన విషయం. మొదటిసారి కెప్టెన్సీలోనే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ ఓవర్ జోగేందర్ శర్మకు ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ ఆ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించి ప్రపంచ కప్ నెగ్గడంతో అందరూ ధోనినే కరెక్ట్ అన్నారు. అలాగే 2016 టీ20 ప్రపంచ కప్ లో కూడా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ అంతగా అనుభవం లేని పాండ్యకు ఇచ్చి ఇలానే చేసాడు.

Advertisement

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే ధోని ఈలాటి నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు.. తీసుకునే ముందు ఎలా ఆలోచిస్తాడు అనేది చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా ఉన్నారు. తాజాగా బీసీసీఐ కార్తీక్ కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఇదా.. అదా అని ఆడుతున్న ప్రశ్నలకు కార్తీక్ సమాధానం ఇచ్చాడు.

Advertisement

అందులో భాగంగానే మీకు ఎగిరే శక్తి కావాలా.. లేక ఎవరి మైండ్ నైనా చదివే శక్తి కావాలా అని ప్రశ్నించగా… నాకు ఎగిరే శక్తి వస్తే నేను అమెరికాలో ఉన్న అలస్కాకు వెళ్ళిపోతా..! ఎందుకంటే నేను ఆ ప్లేస్ గురించి చాలా విన్నాను. అందుకే అక్కడికి వెళ్తాను. అలాగే ఒకవేళన్ నాకు మైండ్ రీడ్ చేసే శక్తి వస్తే నేను తప్పకుండ ధోని మైండ్ ను రీడ్ చేస్తా.. అతను ఏం ఆలోచిస్తున్నాడు అనేది తెలుసుకుంటా అని సమాధానం ఇచ్చాడు. అయితే దినేష్ 37 ఏళ్ళ వయసులో ఐపీఎల్ లో బాగా రాణించి మళ్ళీ భారత జట్టులోకి వచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 5 టీ20 సిరీస్ లోని భారత జట్టులో ఇప్పుడు కార్తీక్ సభ్యుడు.

ఇవి కూడా చదవండి :

వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ…!

ఇల్లీగల్ ఫీల్డింగ్ అంటే ఏంటి ? ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఎందుకు..?

Visitors Are Also Reading