Home » సైలెంటుగా ఆ పని చేసిన టాలీవుడ్‌ హీరో..?

సైలెంటుగా ఆ పని చేసిన టాలీవుడ్‌ హీరో..?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ప్రముఖ కుర్ర హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇటీవల కాలంలో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో మన ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

Dil Raju's nephew Ashish Reddy gets engaged to Advitha Reddy in Hyderabad

Dil Raju’s nephew Ashish Reddy gets engaged to Advitha Reddy in Hyderabad

సినిమాల్లోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ వివాహం చేసుకోబోతున్నాడు. ఆశిష్ తన ఎంగేజ్మెంట్ ని చాలా తక్కువ మందితో అంగరంగ వైభవంగా జరుపుకున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అయినటువంటి అద్వైతతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకొని ఉంగరాలు మార్చుకున్నారు.

Advertisement

వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక వీరి వివాహానికి సంబంధించి ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లను చాలా గ్రాండ్ గా జరిపించాలని ప్లాన్ వేసుకుంటున్నారట.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading