పెళ్లంటే నూరేళ్లపంట అంటారు మన పెద్దలు. పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాల్సిన భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి గొడవలు పెట్టుకొని ఆ గొడవలు చాలా పెద్దదిగా చేసుకుంటూ విడాకులు తీసుకునే వరకు వెళ్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ… ఇంట్లో భార్య భర్తల మధ్య సద్దుమణిగే గొడవలని పెద్దదిగా చేసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Advertisement
ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సద్దుమణిగితే ఆ గొడవ అంతటితో అంతమయ్యి మళ్ళీ ఎప్పటిలాగే కలిసి ఉండవచ్చు. భర్త కోపంలో ఒక మాట అంటే భార్య పడాలి. అలాగే భార్య ఏదైనా విషయంలో గొడవపడితే భర్త సర్దుకుపోవాలి. గొడవపడి అలగడం, కొట్టుకోవడం లాంటివి చేయకుండా మాటలతో సరిపెట్టుకొని ఆ తర్వాత మళ్లీ కలిసి పోవాలి. ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లడం వల్ల ఇంట్లో పనులు ఒక్కరే చేసుకోవడంతో ఆడవాళ్ళకి కోపం వస్తుంది.
Advertisement
ఈ విషయాలను భర్తలు అర్థం చేసుకొని ఇంట్లో కొంచెం సహాయం చేయాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక ఇద్దరు ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా చాలా దగ్గరవుతారు. అప్పుడప్పుడు బయటకు వెళ్లడం.. సినిమాలకు, షికార్లకు వెళ్లడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇలా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడం వల్ల గొడవలకి, కోపాలకి తావుండదు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !
ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?
ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే