Home » పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!

పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!

by Azhar
Ad

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. గిరాకీ పెరిగే పండ్లలో మామిడి కాయతో పాటుగా పుచ్చకాయ కూడా ఉంటుంది. దాదాపుగా 90 శాతానికి పైగా నీళ్లు ఉంటె పుచ్చకాయను తింటే… ఈ ఎండాకాలంలో మనం ఎండదెబ్బ నుండి తప్పించుకుంటాం. అయితే ఈ పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఎలా గుర్తించడం అనేది చాలా మందికి తెలియదు. అందుకే చాలా మంది అవగాహనా లేక కాయ కొని ఇంటికి వెళ్లి తినాలి అని చూస్తే.. ఏదో ఒక లోపం కనిపిస్తుంది. అందుకే పుచ్చకాయలో మంచిదో.. చెడ్డదో ఈ లక్షణాలు చూసి గుర్తించవచ్చు.

Advertisement

అయితే ఈ పుచ్చకాయలో మనకు ఆడ, మగా అని ఉంటాయి. ఆడ కాయలు గుండ్రంగా ఉంటె మగవి గుడ్డు ఆకారంలో ఉంటాయి. అయితే మాములుగా ఆడ కాయలు ఎక్కువ తీయగా ఉంటాయి. అలాగే పుచ్చకాయను కోనేట్టపుడు.. మన దాని మీదట వేలితో కొట్టినప్పుడు.. గుల్లలాగా శబ్దం వస్తే.. అది బాగా పడిందని అర్ధం. అలాకాక గట్టిగ ఉంటె ఇంకా పండలేదు అని అనుకోవచ్చు. ఈ కాయలు బాగా తీయగా ఉండవు.

Advertisement

ఇక కాయను మనం చేతిలోకి తీసుకున్నప్పుడు.. అది దాని ఆకారం కంటే ఎక్కువ బరువు ఉంటె.. బాగా నీళ్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ కాయను వాసన చూస్తీ తీయగా రాగానే చాలా మంది తీసుకుంటారు. కానీ అలా వాసన వచ్చిన కాయ. బాగా పండి పాడైపోవడానికి సిద్ధంగా ఉంది అని అర్ధం. అలాగే కాయపైన మచ్చలు ఉంటె చాలా మంచి తీసుకోరు. కానీ ఆ కాయలు తీయగా ఉంటాయి. తేనెటీగలు ఎక్కువగా కాయపైన వాలడం వల్ల ఈ మచ్చలు అనేవి ఏర్పడుతాయి.

ఇవి కూడా చదవండి :

హైదరాబాద్ పై RCB భారీ విజయం..

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

Visitors Are Also Reading