ఫ్యాన్ అంటే మూడు రెక్కలే ఉంటాయని చాలామందికి తెలుసు…ఒకవేళ మూడుకంటే రెక్కలు ఎక్కువైనా తక్కువైనా అది పెద్ద వింతే అవుతుంది. అయితే అమెరికా వెళ్లిన వాళ్లకు తెలిసిన నిజం ఏంటంటే ఫ్యాన్ కు నాలుగు రెక్కలు కూడా ఉంటాయి. అంటే మనదగ్గర ఫ్యాన్ కు మూడు రెక్కలే ఉంటే అమెరికాలో మాత్రం నాలుగు రెక్కలుంటాయి. అయితే ఇప్పుడిప్పుడు మన దగ్గర కూడా నాలుగు రెక్కల ఫ్యాన్లు దర్శనం ఇస్తున్నాయి కానీ అలి చాలా అరుదనే చెప్పాలి.
Also Read: సినిమాల కంటే ఓటీటీ లోనే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ వీరే..!
Advertisement
Advertisement
అయితే అమెరికాలో నాలుగు రెక్కలు ఉండటం..భారత్ లో మూడు రెక్కలు ఉండటం వెనక కారణం మాత్రం చాలా మందికి తెలియదు. అలా ఉండటానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం…..అమెరికాలో సాధారణంగా చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ నాలుగురెక్కల ఫ్యాన్ లను వాడుతారట. నాలుగు రెక్కలకు చలికి సంబంధం ఏంటని డౌట్ రావచ్చు. దానికి కూడా ఓ రీజన్ ఉంది.
నాలుగు రెక్కల ఫ్యాన్ నుండి గాలి తక్కువగా వీస్తుందట. ఆ గాలి కూడా కాస్త వేడిగా ఉంటుందట. అందువల్లే అమెరికాలో నాలుగు రెక్కల ఫ్యాన్ లను వాడతారట. ఇక భారత్ లో చలి తీవ్రత పెద్దగా ఉండదు. మనది సమశీతోష్ణ మండలం ఇక్కడ దాదాపు అన్నీ సమానంగానే ఉంటాయి. కాబట్టి మనదేశంలో మూడు రెక్కల ఫ్యాన్ లను వినియోగిస్తాం.
Also Read: హైదరాబాద్ ఫేమస్ “రామ్ కీ బండీ” బ్రాండ్ గా ఎలా మారిందో తెలుసా..?