Home » కాంతార కంటే ముందే అదే కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా..? కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటే..?

కాంతార కంటే ముందే అదే కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా..? కానీ ఎందుకు ఫ్లాప్ అయ్యిందంటే..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా కాంతార‌. భారీ బ‌డ్జెట్ సినిమాలు…భారీ వీఎఫ్ఎక్స్ తో తీసిన సినిమాలు మాత్ర‌మే ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ ల‌కు ర‌ప్పిస్తాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో కాంతార సినిమా ఆ ముచ్చ‌ట్ల‌న్నీ ఫేక్ అని నిరూపించింది. నిజానికి కాంతార క‌న్న‌డ చిత్రం. ఈ సినిమాను ముందుగా అక్క‌డ మాత్ర‌మే రిలీజ్ చేశారు. కాగా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది.

దాంతో ఆ త‌ర‌వాత ఇత‌ర భాష‌ల్లో ఓటిటి లో విడుద‌ల చేయాల‌ని మొద‌ట భావించారు. కానీ బ‌జ్ చూసి థియేట‌ర్ ల‌లోనే విడుద‌ల చేశారు. దాంతో థియేట‌ర్ ల‌లో ఈ సినిమా స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. కేజీఎఫ్ త‌ర‌వాత మ‌ళ్లీ ఆ రేంజ్ లో కాంతార క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతోంది. కాంతార అంటే అస‌లు అర్థం అడ‌వి అని.

Advertisement

Advertisement

అడ‌విలోని ఓ తెగ‌వాళ్ల‌కు చెందిన ఆచారాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే వారి ఆచారాల‌తో పాటూ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను అద్ది ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి క‌థ‌ను రాసుకున్నాడు. ఈ సినిమాలో హీరోగా కూడా రిష‌బ్ శెట్టినే న‌టించాడు. సినిమాలో రిషబ్ శెట్టి న‌ట‌న‌తో పాటూ క‌థ క‌థ‌నం అద్భుతంగా ఉన్నాయి.

అయితే ఇదే కాన్సెప్ట్ గా గ‌తంలో కూడా క‌న్న‌డ‌లో ఓ సినిమా వ‌చ్చింది అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. ఆ సినిమా పేరు పింగారా కాగా ఆ చిత్రాన్ని క‌న్న‌డ మ‌రియు తులు భాష‌ల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో పీడిత కులాల నిర‌స‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డాన్ని చూపించారు. కాంతార సినిమాతో పోలిస్తే పింగారా నిజాయితీ ఉన్న సినిమా అని చూసిన‌వాళ్లు చెబుతుంటారు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హంగులు లేని కార‌ణంగా పింగారా సినిమాకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు ఈ సినిమా కేవ‌లం ఫిలింఫెస్టివెల్ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యింది.

Visitors Are Also Reading